Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu:ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు? మీ రోజువారీ జాతకం చెబుతుంది.
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
'మేజర్' గురించి మాట ఇచ్చా.. నిలబెట్టుకున్నా.. అడివి శేష్ ఆసక్తికర ట్వీట్
అడివి శేష్ హీరోగా వచ్చిన మేజర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. సినిమా విడుదల కాకముందే సుమారు 10 నగరాలలో ప్రీమియర్ షో ద్వారా అనేక మందికి సినిమా చూపించి తమ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు. అలా అనేక అంచనాలతో ఈ సినిమా జూన్ 3న విడుదలైయింది. మేజర్ సినిమా రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని, భారీ విజయం సాధించడమే కాక మంచి కలెక్షన్లు కూడా సాధించింది.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమాను మెచ్చుకుంటున్నారు. మేజర్ సినిమాపై ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టిన క్రమంలో ఇంకా వెనక్కి తగ్గకుండా కలెక్షన్స్ కురిపిస్తోంది. ఇప్పటికీ మేజర్ చిత్రం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో తాజాగా అడివి శేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మేజర్ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకువస్తానని కరోనా సంక్షోభంలో మాట ఇచ్చాను, నా మాట నిలబెట్టుకున్నాను కూడా, మేజర్ సినిమా రిలీజై ఇది నాలుగవ వారం. ఈ నాలుగో వారం కూడా మేజర్ థియేటర్లో సందడి చేస్తుంది' అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.

కాగా
ఈ
సినిమాలో
హీరోయిన్
బాలీవుడ్
సాయి
ముంజ్రేకర్
నటించగా
మేజర్
సందీప్
తల్లిదండ్రులుగా
ప్రకాశ్
రాశ్,
సీనియర్
నటి
రేవతిలు
కనిపించగా
ఇక
శోభితా
ధూలిపాళ్ల,
మురళీ
శర్మ,
అనీష్
తదితరులు
ఇతర
కీలక
పాత్రల్లో
నటించారు.
ఇక
సైన్యంలో
చేరాలని
ఆసక్తి
కనబరిచే
యువతకు
తమ
వంతు
మద్దతు
ఇవ్వాలని
భావిస్తున్నట్లు
సినీ
హీరో
అడవి
శేష్
గతంలో
ప్రకటించారు.
ఈ
సినిమా
చూసిన
తర్వాత
చాలా
మంది
ఆర్మీలో
చేరాలంటూ
తమ
ఆకాంక్ష
వ్యక్తం
చేస్తూ
మెసేజ్
లు
పంపిస్తున్నారు
అని
పేర్కొన్న
అడవి
శేష్
సందీప్
ఉన్నికృష్ణన్
స్ఫూర్తిని
మరింత
ముందుకు
తీసుకు
వెళ్లేందుకు
అలా
మెసేజ్‌లు
చేసిన
వారికి
సైన్యంలో
చేరాలని
ఆసక్తి
చూపిస్తున్న
వారికి
తమ
వంతు
కృషి
చేయడానికి
నిర్ణయం
తీసుకున్నామని
వెల్లడించారు.