Major Teaser Telugu: సోల్జర్ అంటే అర్డమేంటి?.. అడివి శేష్ ఎమోషనల్ టచ్!
నేటితరం యువ హీరోలు రొటీన్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆడియెన్స్ కూడా కొత్త ఎదో చూడాలనే ఆలోచనతోనే సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రయోగాలు అన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు. అయితే కరెక్ట్ గా రియల్ స్టోరీలను తెరకెక్కించగలిగితే ఆడియెన్స్ అమితంగా ఇష్టపడతారు. ప్రస్తుతం అడివిశేష్ చేస్తున్న మేజర్ సినిమా కూడా ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

రియల్ హీరో కథతో..
విభిన్నమైన కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్న హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఈ యంగ్ యాక్టర్ నుంచి నెక్స్ట్ మేజర్ అనే రియల్ స్టోరీ రాబోతోంది. క్షణం, గూఢచారి, ఎవరు వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న అడివి శేష్ ఈ సారి ఉగ్ర దాడుల్లో వీరోచితంగా పోరాడిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ కథతో రాబోతున్నాడు.

టీజర్ ను విడుదల చేసిన మహేష్ బాబు
మేజర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఇదివరకే ఒక ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక టీజర్ తో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశారు. మహేష్ బూబు బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్స్ - సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఆలోచింపజేస్తున్న టీజర్
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆ రియల్ హీరో జీవిత ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఎమోషనల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్.. సోల్జర్ అంటే ఆర్డమేంటి ? ఎందుకు సైనికుడు అవ్వాలని అనుకుంటున్నావు? అనే డైలాగ్స్ తో అమితంగా ఆకట్టుకుంటుంది.

ఒక సైనికుడు కావాలి
ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. అలాగే వాళ్ళందరిని కాపాడాలి అంటే ఒక సైనికుడు కావాలి అనే జవాబుతో అడివి శేష్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాడు. చివరలో నేను చూసుకుంటాను ఎవరు రాకండి అంటూ చెప్పే డైలాగ్ కూడా మెమోషనల్ గా టచ్ చేస్తోంది. చూస్తుంటే అడివి శేష్ బాక్సాఫీస్ వద్ద మరొక హిట్ కొట్టేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











