twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మేజర్’ అలా పుట్టింది: లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ చేసిన మహేశ్ బాబు

    |

    విలక్షణ నటనతో విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు యంగ్ హీరో అడవి శేష్. కెరీర్ ఆరంభంలో పవన్ కల్యాణ్ 'పంజా', రవితేజ 'బలుపు' వంటి సినిమాల్లో విలన్‌గా నటించిన అతడు.. హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే 'క్ష‌ణం', 'గూఢ‌చారి', 'ఎవరు' వంటి సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'మేజర్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ అయింది.

    ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్'. శ‌శికిర‌ణ్ తిక్క తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ వీడియోను మహేశ్ బాబు విడుదల చేశాడు. అలాగే, చిత్ర యూనిట్‌కు బెస్ట్ విసెష్ తెలియజేశాడు.

    Adivi Sesh Major The Look Test released by Mahesh Babu

    తాజాగా విడుదలైన వీడియోలో అసలు మేజర్ సినిమా పుట్టుకకు కారణం ఏమిటి అన్న దానిపై హీరో అడవి శేష్ వివరించాడు. ఈ సినిమాకు కథ సహకారం అందించిన అతడు.. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితంపై చేసిన రీసెర్చ్, ఆయన కుటుంబ సభ్యుల పర్మీషన్ కోసం పడిన కష్టం సహా తదితర విషయాలను వెల్లడించాడు. ఈ వీడియోకు బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత వన్నె తెచ్చింది. ఇదిలాఉండగా, 'మేజర్'ను పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 17న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు.

    English summary
    Biopics seem to be a flavour of the season across film industries. From Sye Raa Narasimha Reddy, J Jayalalithaa's biopic Thalaivi to Narendra Modi's biopic, many biographic films are in the making. The latest one to join the list is Hindi-Telugu bilingual flick, Major.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X