అమెరికాలో ప్రేమ..నా పుట్టినరోజునే మరో అబ్బాయితో పెళ్లి.. బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన శేష్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాతో ఇటీవలే అడవి శేష్ సూపర్ హిట్ అందుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి మరిన్ని వసూళ్లు సాధిస్తూ భారీ లాభాల దిశగా పరుగులు పెడుతోంది. మేజర్ సినిమాతో హిట్ కొట్టిన అడవి శేష్ తాజాగా తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నిరాశ చెందకుండా

నిరాశ చెందకుండా

ఎలా అయినా హీరో అవ్వాలని ఉద్దేశంతో అమెరికాలో చదువు పూర్తి చేసి తిరిగి ఇండియా వచ్చి నటుడు అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు అడివి శేష్. అందులో భాగంగానే ఆయన తొలుత పంజా లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. అయినా సరే ఏ మాత్రం నిరాశ చెందకుండా మొట్ట మొదటి సారిగా క్షణం అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

వరుసగా సినిమాలు

వరుసగా సినిమాలు

హీరోగా క్షణం సినిమాతో పేరు తెచ్చుకున్న అడవి శేషు ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా అడివి శేష్ గూడచారి, ఎవరు వంటి సినిమాలతో హిట్ కొట్టి ఎప్పటి నుంచో తన మదిలో ఉన్న ఒక సబ్జెక్ట్ ను పట్టాలు ఎక్కించారు. ముంబై ఉగ్రవాద దాడుల్లో మరణించిన కేరళకు సంబంధించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఆయన ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ ఐడియాను మహేష్ బాబు ముందుకు తీసుకు వెళ్ళగా ఆయన నిర్మించేందుకు ఒప్పుకోవడంతో సినిమా నిర్మాణం ప్రారంభమైంది.

దాటవేసే ప్రయత్నం

దాటవేసే ప్రయత్నం


అలా ఈ సినిమా తెరకెక్కించిన తర్వాత జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే తాజాగా అడివి శేష్ ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నాడు. ఈ షోలో భాగంగానే అడవి శేషు పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగితే ఆ విషయం మీద తొలుత దాటవేసే ప్రయత్నం చేశాడు అడవిశేషు.

 మనసులో మాట

మనసులో మాట

అయితే అలీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అసలు ఎందుకు మీరు ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు అనే విషయాన్ని గుచ్చి గుచ్చి అడగడం తో పాటు గతంలో ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా అని కూడా ఆరా తీశాడు. అయితే గతంలో తనకు ఉన్న ప్రేమ వ్యవహారాల గురించి అప్పుడు అడవి శేషు తన మనసులో మాట బయట పెట్టాడు.

పుట్టిన రోజునే

పుట్టిన రోజునే


తాను అమెరికాలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని అయితే మా ప్రేమ సఫలం కాలేదని చెప్పుకొచ్చాడు. నా పుట్టిన రోజునే తాను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నదంటూ అడివి శేష్ ఎమోషనల్ అయ్యాడు. మొత్తం మీద అడవి శేష్ చెప్పిన బ్రేకప్ స్టోరీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అడివి శేష్ ఇప్పుడు హిట్ సినిమాను సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X