తెలుగు హిట్ మూవీకి సీక్వెల్: ‘గూఢచారి 2’ వర్క్ మొదలైంది!

అడవి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' చిత్రం ఈ ఏడాది విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన స్పై థ్రిల్లర్ తీశారనే ప్రశంసలు ఈ సినిమా దక్కించుకుంది. త్వరలో దీనికి సీక్వెల్ రాబోతోంది.

అడ‌వి శేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సీక్వెల్ ప్రకటిస్తూ ఓ స్టేట్మెంట్ విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కొన్ని రోజుల క్రితమే మొద‌లైంది. ఈ వర్క్ పూర్తయిన తర్వాత 2019లో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Adivi Sesh’s Goodachari 2 Script Work Begins

మొదటి భాగం హిట్టయింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్‌తో ఈ సారి బడ్జెట్ కాస్త ఎక్కువ పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గూఢ‌చారి సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్‌లో అసిస్టెంట్‌గా ఉన్న రాహుల్ పాకాల గూఢచారి 2కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారని తెలుస్తోంది.

అయితే ఈ చిత్రాన్ని నిర్మించేది ఎవరు? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. 2020లో ఈ సీక్వెల్ విడుద‌ల కానుందని అడవి శేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ సారి కాస్త డిఫరెంటుగా హాలీవుడ్ స్టైల్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X