twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మేజర్' సెన్సార్ పూర్తి.. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి మరీ సభ్యుల సెల్యూట్!

    |

    క్షణం, గూడచారి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఆయన హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సత్తా చాటిన అడివి శేష్ కి ఈ మేజర్ అనేది మొట్టమొదటి పని ఇండియా ప్రాజెక్ట్. అయితే తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాకపోయినా తెలుగు, హిందీ, మలయాళ భాషలలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. ఒక రకంగా పాన్ ఇండియా మూవీ గానే భావిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొత్తం 149 నిమిషాల నిడివితో ఉన్న సినిమా చూసిన సెన్సార్ సభ్యులు u/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాలో ఉన్న కంటెంట్ సహా లోతైన ఎమోషనల్ సీన్స్ చూసి సెన్సార్ అధికారులు ఫిదా అయిపోయారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పూర్తయిన తర్వాత సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ను స్మరించుకుంటూ శాల్యూట్ కూడా కొట్టారని తెలుస్తోంది.

    సినిమా మొదటి భాగం అంతా కూడా సందీప్ ఉన్నికృష్ణన్ వ్యక్తిగత జీవితంలోని విషయాలను ఎక్కువగా చూపించగా, సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సందీప్ ఉన్నికృష్ణన్ కు తన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం తన ప్రేయసి ఇషతో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఇక సెకండాఫ్ లో వచ్చే హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని కచ్చితంగా ఆడియన్స్ అందరూ సరికొత్త అనుభూతి ఫీల్ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే మేజర్ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటి విషయాలకు మంచి స్పందన లభించింది. ఒక్క సినిమా కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

     Adivi Seshs major movie censor talk

    ఈ సినిమాని మహేష్ బాబుకు చెందిన ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలో నటించగా సందీప్ ప్రేయసిగా సాయి మంజ్రేకర్ నటించింది. అలాగే కీలక పాత్రలో శోభిత ధూళిపాళ్ల నటించినట్లు సమాచారం. జూన్ 3వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాను తొమ్మిది నగరాలలో 24వ తేదీ నుంచి ప్రీమియర్ షోలు వేస్తున్నట్లుగా సినిమా యూనిట్ ప్రకటించింది. ఒక సినిమా విడుదలకు పది రోజులు ముందే ఇలా ప్రీమియర్స్ వేయడం అనేది తెలుగు సినీ హిస్టరీలో మొట్ట మొదటి సారి అని చెప్పవచ్చు. సినిమా మీద 100% నమ్మకం లేకపోతే ఏ దర్శకనిర్మాతలు కూడా ఇలాంటి ఫీట్ కి పూనుకోరు.

    English summary
    Adivi Sesh's major movie censor completed. censor officers gave stanging ovation to movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X