For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Major Twitter Review: అంతటా అలాంటి టాక్.. రేటింగ్ ఇవ్వనంతగా.. ఫైనల్ రిపోర్టు ఏంటంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో ఉన్నతమైన నేపథ్యాలు ఉన్న బయోపిక్ మూవీలు వస్తున్నాయి. అందులో చాలా వరకూ విజయాలను అందుకోవడంతో ఫిల్మ్ మేకర్లు, హీరోలు మరిన్ని ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'మేజర్'. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విలక్షణ నటుడు అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది? ఇందులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి? అసలు దీనిపై ట్విట్టర్‌లో ఎలాంటి రివ్యూలు వస్తున్నాయి? అనేవి చూద్దాం పదండి!

  Recommended Video

  Major Movie Review...Adivi Sesh కెరీర్ బెస్ట్ మూవీ #Tollywood | Filmibeat Telugu
  ‘మేజర్‌’గా వచ్చేసిన అడివి శేష్

  ‘మేజర్‌’గా వచ్చేసిన అడివి శేష్

  అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రమే ‘మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేసింది. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ చరణ్ పాకాల ఈ బయోపిక్ మూవీకి సంగీతాన్ని సమకూర్చాడు.

  మరోసారి రష్మిక మందన్నా హాట్ ట్రీట్: ఎద భాగం కనిపించేలా ఘాటుగా!

  రియల్ హీరో కథతో భావోద్వేగంగా

  రియల్ హీరో కథతో భావోద్వేగంగా

  హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న అడివి శేష్ ఇప్పుడు ‘మేజర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీన్ని ఎంతో ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేసింది.

  బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

  బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

  అడివి శేష్ నటించిన ‘మేజర్' మూవీ నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి రూ. 13 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

  డ్రెస్ విప్పేసి షాకిచ్చిన అమలా పాల్: ఎద అందాలు కనిపించేలా ఘోరంగా!

  ‘మేజర్’ మూవీకి షాకింగ్ టాక్

  ‘మేజర్’ మూవీకి షాకింగ్ టాక్

  అడివి శేష్ - సయూ మంజ్రేకర్ జంటగా నటించిన ‘మేజర్' మూవీ ఎమోషనల్ అండ్ యాక్షన్ బయోపిక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇది చాలా ఎమోషనల్‌గా ఉందని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు.

  ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

  ‘మేజర్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడంతో పాటు పరిచయ సన్నివేశాలు బాగున్నాయట. ఇక, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా ఉంటుందట. సెకెండాఫ్ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంటుందట. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే సీన్స్ ఉంటాయట. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు.

  Poorna Gets Engaged: కోటీశ్వరుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ పూర్ణ.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే!

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

  ‘మేజర్' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో అడివి శేష్ వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, శోభిత, రేవతి నటన బాగుందట. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. ఇక, ఇలాంటి సినిమాకు మైనస్‌లు చెప్పడం, రేటింగ్ ఇవ్వడం చేయమని కొందరు చెప్తున్నారు.

  మొత్తంగా మేజర్ ఎలా ఉందంటే!

  మొత్తంగా మేజర్ ఎలా ఉందంటే!

  ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. అడివి శేష్ నటించిన ‘మేజర్' మూవీ భావోద్వేగాలతో కూడిన బయోపిక్ మూవీ అని అంటున్నారు. ఇలాంటి సినిమాలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే చాలా అరుదుగా వస్తుంటాయని సినిమాను చూసిన వాళ్లు చెబుతున్నారు. మొత్తంగా ట్వీట్లను చూస్తే ఈ చిత్రాన్ని అన్ని వర్గాల వాళ్లు చూసేలా తెరకెక్కించారని తెలుస్తోంది.

  English summary
  Tollywood Young Hero Adivi Sesh did Major Movie Under Sashi Kiran Tikka Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X