నానికి థ్యాంక్స్ చెప్పిన అడవి శేష్.. ఎందుకో తెలుసా..?
'క్షణం', 'గూఢచారి' వంటి వినూత్న కథాంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు యంగ్ హీరో అడవి శేష్. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో కమ్ రైటర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఎవరు'. కొత్త దర్శకుడు రామ్ జీని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. పీవీపీ సినిమాస్ బ్యానర్‌లో 'ఎవరు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రెజీనా కసండ్ర హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ దీనిపై అంచనాలను పెంచేసింది. ఇటీవల వచ్చిన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ఇందులో రెజీనాను ఎవరో రేప్ చేసినట్లు.. ఈ కేసును అడవి శేష్ టేకప్ చేసినట్లు చూపించారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అడవి శేష్ తన సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను వెల్లడించాడు.

'ఎవరు' ట్రైలర్ రేపు విడుదల కానుంది. దీన్ని హీరో అడవి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. అంతేకాదు, ఈ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తారని వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి నాని సిద్ధంగా ఉన్నారు. మీ చొరవకు థ్యాంక్స్. మీ మీద నాకెంతో ప్రేమ, గౌరవం ఉంది. గాయ్స్.. రేపు ఉదయం 10.30 గంటలకు 'ఎవరు' ట్రైలర్‌ను నాని లాంచ్ చేస్తారు' అని శేష్ ట్వీట్ చేశాడు.
'ఎవరు' సినిమాను మొదట ఆగస్టు 23న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. 'సాహో' వాయిదా పడటంతోనే విడుదల తేదీని ఆగస్టు 15కి మార్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మిగిలిన అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











