మేజర్ టికెట్ రేట్ల మీద నెటిజన్ ట్వీట్.. రెండు గంటల్లో రేట్లు తగ్గేలా చేసిన శేష్

యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న అన్ని సినిమాలు మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న 'మేజర్' జూన్ 3న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న మేజర్ సినిమాను 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఇక కాలంలో విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా కూడా సినిమాపై అంచనాలు అంతకంతకు పెంచే విధంగా ఉన్నాయి.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడంతో రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైట్మెంట్ తో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారి బయోపిక్ చిత్రం కావడంతో టికెట్ ధరలు పెంచకుండా ఉన్న ధరల్లోనే రిలీజ్ చేస్తున్నామని అధికారికంగానే సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 70 ఎంఎం లో బాల్కనీ టికెట్ ధర 175 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఒక నెటిజన్ నేరుగా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అడవి శేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శేష్ వెంటనే స్పందించి థియేటర్ యాజమాన్యంతో చర్చించి టికెట్ ధర సమస్యని రెండు గంటల్లో పరిష్కరించారు. ఈ విషయాన్ని మళ్ళీ శేష్ ట్వీట్ చేసి మరీ చెప్పారు. 'నేను సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అభ్యర్ధించాను. వారు సహకరించినందుకు ధన్యవాదములు.

 Adivi Sesh sorts Major ticket prices issue with theatre in two hours

మేజర్ సినిమాను అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు నిర్ణయించాం. ఆ దిశగా ముందుకు వెళ్తాం' అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాని మహేష్ బాబుకు చెందిన ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలో నటించగా సందీప్ ప్రేయసిగా సాయి మంజ్రేకర్ నటించింది. జూన్ 3వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాను తొమ్మిది నగరాలలో 24వ తేదీ నుంచి ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ లో ప్రీమియర్ వేయగా హైదరాబాద్ లో కూడా ప్రీమియర్ త్వరలోనే వేయనున్నారు. ఇక ఒక సినిమా విడుదలకు పది రోజులు ముందే ఇలా ప్రీమియర్స్ వేయడం అనేది తెలుగు సినీ హిస్టరీలో మొట్ట మొదటి సారి అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X