మేజర్ మూవీ కోసం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న మహేష్ బాబు
విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్న టాలెంటెడ్ హీరో అడివి శేష్ నెక్స్ట్ మేజర్ అనే రియల్ స్టోరీతో రాబోతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న అడివి శేష్ ఈ సారి ఉగ్ర దాడుల్లో వీరోచితంగా పోరాడిన రియల్ హీరో కథతో రాబోతున్నాడు. మేజర్ అనే ఆ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ కూడా ఇచ్చేశారు.
ఇటీవల ఒక ఫస్ట్ గ్లింప్స్ ను మహేష్ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడే సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బూబు బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్స్ అలాగే సోనీ పిక్చర్స్ శరత్ చంద్ర సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2006లో ముంబైలో జరిగిన అతి భయంకరమైన టెర్రరిస్టుల ఉగ్రదాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

ఆ రియల్ హీరో జీవిత ఆధారంగానే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. శోభిత ధూళిపాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ టీజర్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 13న టీజర్ ను మహేష్ బాబు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.
చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తోంది. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











