అద్నాన్ సమీ కుమారుడు హీరోగా ఎంట్రీ.. ఎక్కడ.. ఏమిటి?
సినీ రంగంలో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయంగా కనిపిస్తుంది. సినీ ప్రముఖుల వారసులు ఇండస్ట్రీలోకి రావడం కొత్తేమీ కాదు. తాజాగా ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ కుమారుడు అజాన్ సమీ ఖాన్ పాకిస్థాన్ సినిమా పరిశ్రమలో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అజాన్ సమీ ఖాన్ యాక్టింగ్‌లోకి ప్రవేశించడానికి ముందు మ్యూజిక్ రంగంలో కూడా రాణిస్తున్నాడు.
పాకిస్థాన్‌లో రూపొందే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సైఫ్ హసన్ అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు. తన కుమారుడు నటుడిగా రంగ ప్రవేశం చేయడంపై అద్నాన్ సమీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ చిత్రం హెన్నాలో నటించిన జేబా భక్తియార్ కుమారుడే అజాన్. జేబా భక్తియార్‌ను ప్రముఖ సినీ దిగ్గజం రాజ్ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కపూర్ మరణానంతరం ఆయన కుమారుడు రణ్‌ధీర్ కపూర్ ఈ సినిమాను పూర్తి చేశారు.

హమ్జా అలీ అబ్బాసీ, అహద్ రాజా మీర్ రూపొందించిన ఓ అల్బమ్‌కు అజాన్ సంగీతాన్ని సమకూర్చాడు. అలాగే పారే హుత్ లవ్ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించారు. ఇటీవల బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మిహీరా ఖాన్ చిత్రం సూపర్‌స్టార్ అనే చిత్రానికి కూడా మ్యూజిక్ అందించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











