»   » పుట్టినరోజు వేళ... కొడుకు చేసిన పనికి మురిసిపోయిన ఎన్టీఆర్ (ఫోటోస్)

పుట్టినరోజు వేళ... కొడుకు చేసిన పనికి మురిసిపోయిన ఎన్టీఆర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ జూ ఎన్టీఆర్ నేడు 34వ వసంతంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు వేళ షూటింగులు, ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టేసి పూర్తి సమయం ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు యంగ్ టైగర్.

తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందరి కంటే ముందు అభయ్ పుట్టినరోజు విషెస్ చెప్పాడని, ఈ సంవత్సరం నేను అందుకున్న మొదటి మరియు అత్యంత విలువైన పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవే అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.

అభయ్ విషెస్

అభయ్ విషెస్

శుక్రవారం అర్దరాత్రి సమీపంలో 11.45 గంటలకు ఎన్టీఆర్ ట్విట్టర్లో ఈ పోస్టు చేసాడు. ఈ పోస్టు అయిన కొన్ని గంటల్లోనే వేలాది లైకులు, రీట్వీట్లతో వైరల్ అయింది.

హ్యాపీ మూమెంట్స్

హ్యాపీ మూమెంట్స్

ఈ పుట్టినరోజు వేళ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఇలా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

అన్నయ్య

అన్నయ్య

జూ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్..... తన తమ్ముడికి విషెస్ చెబుతూ ఈ ఫోటో పోస్టు చేసాడు. ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ బాండ్ ఉందో చెప్పడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున లేస్తున్న ఎన్టీఆర్

పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున లేస్తున్న ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మే 20వ తేదీతో 34వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమాలు, హిట్లు... ప్లాపుల సంగతులను ఓసారి గుర్తు చేసుకుందాం. ముందుగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Check out photos: Adorable moments of NTR with his family members on the day of his birthday!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu