twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో పాపం.. విజయ్ గొంతు నొక్కిన సెన్సార్.. అదిరిందిలో ఆ డైలాగ్స్ కట్..

    తమిళంలో అనేక వివాదాలు చుట్టుముట్టిన మెర్సల్ చిత్రం తెలుగులో అదిరింది పేరుతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    By Rajababu
    |

    Recommended Video

    విజయ్ గొంతు నొక్కిన సెన్సార్

    తమిళంలో అనేక వివాదాలు చుట్టుముట్టిన మెర్సల్ చిత్రం తెలుగులో అదిరింది పేరుతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో డిజిటల్ ఇండియా, జీఎస్టీపై హీరో విజయ్ చెప్పిన డైలాగ్స్ అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఈ డైలాగ్స్‌ను తొలగించాలని తమిళనాడులో పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అదిరింది చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    వివాదాస్పద డైలాగ్స్ ఇవే...

    వివాదాస్పద డైలాగ్స్ ఇవే...

    ఎన్నికల సమయంలో ఓటర్లకు ఫ్రిజ్‌లు, మిక్సీలు, టెలివిజన్లు, బంగారం, డబ్బు లాంటి వస్తువులను పంచే మన దేశంలో రోగులకు ఉచితంగా వైద్యం, ట్యాబ్లెట్లు ఇవ్వలేమా? అని విజయ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.

     ఓట్ల బాక్సుల మాత్రమే

    ఓట్ల బాక్సుల మాత్రమే

    ఎన్నికల సమయంలోనే ఓట్ల బాక్సులు గ్రామాల్లోకి వస్తాయి. ఎలక్షన్లలో ప్రజలకు ఆశ పెడుతారు నాయకులు. ఎన్నికల తర్వాత మాత్రం నాయకుల వెనుక ప్రజలంతా పరుగెత్తాల్సిందే. గ్రామాల్లో కనీస వసతులు లేవు. వైద్య సౌకర్యాలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అనే డైలాగ్స్ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించేలా ఉన్నాయి.

     డిజిటల్ పేరుతో నాకేస్తున్నారు

    డిజిటల్ పేరుతో నాకేస్తున్నారు

    డిజిటిల్ ఇండియా పేరుతో డబ్బులను అంతా నాకేస్తుంటే.. ఎక్కడైనా జేబులో డబ్బులు ఉంటాయా? అని వడివేలు సెటైర్ వేస్తాడు.

    ఉచిత వైద్యం అందించలేమా?

    ఉచిత వైద్యం అందించలేమా?

    రోగులకు అన్యాయం చేస్తున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యులను, వైద్య సిబ్బందిని చంపడం అనేది కథలో భాగం. ఈ అంశంపై ఏ లక్ష్యంతో వారిని చంపావు అనే ప్రశ్నకు సమాధానంగా ఉచిత వైద్యం అని సమాధానం చెబుతాడు.

     మద్యంపై జీఎస్టీ ఉండదా?

    మద్యంపై జీఎస్టీ ఉండదా?

    సింగపూర్‌లో వైద్య చికిత్సపై జీఎస్టీ పన్ను 7 శాతం. మన దేశంలో జీఎస్టీ 28వ శాతం. కానీ సింగపూర్‌లో ఉచితంగా మందులు ఇస్తారు. కానీ మన దేశంలో మందులపై అదనంగా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఇది న్యాయామా అని హీరో విజయ్ ప్రశ్నిస్తాడు. ప్రజల ఆరోగ్యంపై దెబ్బ తీసే మద్యంపై మాత్రం పన్ను విధించరు అని ప్రభుత్వాల తీరును చీల్చి చెండాడుతారు.

     డైలాగ్స్‌పై సెన్సార్

    డైలాగ్స్‌పై సెన్సార్

    అదిరింది చిత్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జీఎస్టీ, డిజిటల్ ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్‌ను ప్రేక్షకులకు వినిపించకుండా సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. ఈ డైలాగ్స్ వినిపించకపోవడంపై ప్రేక్షకులు థియేటర్ల అసహనంతో కేకలు వేయడం స్పష్టంగా వినిపించింది.

    English summary
    Tamil Superstar Vijay's Mersal movie is most contraversial recent times in South film Industry. Dubbing version of this movie released as Adirindhi title on November 9th. Some of the dialogues are removed by Regional censor board which are important to Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X