పెళ్లికి వెళితే వధువు అసహ్యించుకొని వెళ్లిపోయింది.. తరువాత తగిన శాస్తి జరిగింది: షకీలా
బీ గ్రేడ్ అడల్ట్ సినిమాలతో ఒకప్పుడు హాట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా. బీ గ్రేడ్ సినిమాలతో అప్పట్లో మలయాళం సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన షకీలా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. స్టార్ యాక్టర్ గా జీవితాన్ని చూసిన ఆమె ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒక ఇంటర్వ్యూలో షకీలా తన జీవితంలో ఎదురైన షాకింగ్ ఇన్సిడెంట్స్ పై వివరణ ఇచ్చింది.
Recommended Video

భయాన్ని కలిగించిన షకీలా..
మలయాళంలో షకీలా అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు బీ గ్రేడ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. షకీలా సినిమాలు వస్తున్నాయి అంటే మలయాళం స్టార్ హీరోలు కూడా వారి సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా ఓ విధంగా ఒకప్పటి స్టార్ హీరోలను బయపెట్టిందనే చెప్పాలి.

గ్యాప్ లేకుండా సినిమాలు..
షకీలా 17 ఏళ్ళ క్రితం సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్స్ కంటే హై రేంజ్ లో ఆఫర్స్ అందుకునేవారు. ఆమె డేట్స్ కూడా దొరికేవి కావు. తనదైన గ్లామర్ షోతో సంచలనం సృష్టించిన షకీలా తీరిక లేకుండా కొన్నేళ్లపాటు గ్యాప్ లేకుండా సినిమాలు చేశారు. ఆమెకు రెమ్యునరేషన్ కూడా అడిగినంత ఇచ్చేవారట.

కుటుంబ సభ్యులే మోసం చేశారు..
సొంత కుటుంబ సభ్యులే మోసం చేయడం వల్ల సంపాదించినదంతా పోగొట్టుకున్నట్లు షకీలా చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది. బిజీ యాక్టర్ గా ఉన్న షకీలా కొంతకాలం తరువాత సైడ్ క్యారెక్టర్స్ తో జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇక కొన్నిసార్లు బయటకు వెళితే సొంత కుటుంబ సభ్యుల వళ్లే అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.

పెళ్లికి వెళితే..
సొంత అన్నయ్య పెళ్లికి వెళితే.. వధువు తనను చూసి రూమ్ లోకి వెళ్లిపోయి కొద్దీ సేపటివరకు బయటకు రాలేదని షకీలా తెలిపింది. పెళ్లి అయిన తరువాత విష్ చేయడానికి వెళితే.. ఆమె కుటుంబ సభ్యులు తన దగ్గరకు వెళ్లవద్దని అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే కొంత కాలం తరువాత.. మీ అన్నయ్య నన్ను మోసం చేశాడని, నిన్ను అవమానించినందుకు తనకి తగిన శాస్తి జరిగిందని ఆ వధువు తనకు ఫోన్ చేసినట్లు షకీలా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











