twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్లల సినిమాల్లో పెద్దల మసాలా...

    By Bojja Kumar
    |

    మన హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. చిన్నాల కోసం, చిన్నారుల్లో స్పూర్తిని, ఉత్తేజాన్ని నింపడానికి రూపొందిన సినిమాలు మాత్రమే ఇందులో ప్రదర్శితం అవుతాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన 700 ఎంట్రీల్లో 152 చిత్రాలు ప్రదర్శనకు అర్హత సాధించాయి. బాలీవుడ్ సెలబ్రిటీ నందితా దాస్ ఈ ఫెస్టివల్ ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

    అయితే ఫెస్టివల్ లో ప్రదర్శితం అవుతున్న కొన్ని సినిమాల్లో 'పెద్దల మాసాలా" ఉండటంపై ఆమె ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలను సిఎఫ్ఎష్ఐ అధికారులు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదని మండి పడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఆఫ్రికా చిత్రం Un Cargo Pour L'afrique, చైనీస్ చిత్రం Xinghai, మరియు Vostadtkrokodile 2 చిత్రాల్లో అభ్యంతరకర సన్నివేశాల ఉన్నాయని అన్నారు.

    మగువల అందం గురించి వివరించే సన్నివేశాలు, రేప్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి పిల్లల చిత్రోత్సవంలో ప్రదర్శితం కావడం సరికాదన్నారు.

    English summary
    Children's Film Society India (CFSI) chairperson Nanditha Das and CFSI CEO Sushovan Banerjee defended the decision to screen some foreign films with adult content at the film festival, which raised eyebrows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X