»   » సెక్స్ సినిమా వల్లే ఎదిగాను, బాధ లేదన్న హాట్ బ్యూటీ

సెక్స్ సినిమా వల్లే ఎదిగాను, బాధ లేదన్న హాట్ బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో అడుగు పెట్టక ముందు సన్నీ లియోన్ పోర్న్ సినిమాల హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆమెను చాలా మంది వ్యతిరేకించారు. బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ గా వరుస అవకాశాలతో దూసుకెలుతున్న ఆమెను ఇప్పటికీ కొందరు విమర్శిస్తూనే ఉన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ స్పందిస్తూ...‘పోర్న్ సినిమాల వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగాను. నాకంటూ ఒక గుర్తింపును తెచ్చాయి. నేను పోర్న్ స్టార్ ను కావడం వల్లనే బాలీవుడ్లో ఇంత పాపులారిటీ వచ్చింది. సెక్స్ సినిమాల బ్యాగ్రౌండ్ నాకు లేకుంటే నాకు ఇక్కడ అవకాశాలు వచ్చేవే కాదు' అని తెలిపారు.

Adult films are my identity: Sunny Leone

‘కొందరు నన్ను ఈ విషయంలో విమర్శించినా, నన్ను చీప్ అంటూ మాట్లాడినా నేనేమీ పట్టించుకోను. నా గత జీవితం గురించి నేనేమీ చితించడం లేదు. పోర్న్ ఇండస్ట్రీలో నేను ఒక భాగం అయినందుకు, ఆ రంగంలో రాణించినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నేను ఇండియాలో సెటిల్ అవుతానో? లేదో? నాకు తెలియదు. నేను, నా భర్త ఈ విషయం గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నాము' అని తెలిపారు.

తనను ఇండియా నుండి వెళ్లిపోవాలని విమర్శిస్తున్న వారి గురించి మాట్లాడటానికి సన్నీ లియోన్ నిరాకరించింది. బాలీవుడ్లో సక్సెస్ అయిన తర్వాత సన్నీ లియోన్ పోర్న్ సినిమాల్లో నటించడం లేదు. సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ కూడా పోర్న్ సినిమా స్టారే. ప్రస్తుతం వీరు ఆ సినిమాల్లో నటించక పోయినా.... పోర్న్ సినిమాల నిర్మాణాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు.

సన్నీ లియోన్ నటించిన ‘మస్తీ జాదె' బాలీవుడ్ మూవీ జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదొక సెక్స్ కామెడీ మూవీ. సినిమాలో వల్గర్ సీన్లు, సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోంది.

English summary
“Porn films made me what I am. Those gave me the identity and porn films are the only reason for my popularity in Bollywood. I would not have got a chance in Hindi Cinema without this background,” said Sunny Leone in an interview.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu