జూనియర్ ఎన్టీఆర్ ని అడ్డుకోలేక పోయిన విద్యార్ధులు!
జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అదుర్స్" ఆడియో హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన సంగతి తెలిసిందే. వీటి గురించి దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ 'ఒక క్యారెక్టర్ ను అందరూ చేయగలరు. కానీ రెండో క్యారెక్టర్ చేయగల ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ చేయడానికి ధైర్యం, తెగింపు కావాలి. అవన్నీ ఎన్టీఆర్ లో ఉన్నాయి. అద్బుతంగా నటించాడు అంటూ" మెచ్చుకున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసారట ఈ చిత్ర నిర్మాతలు కొడాలి నాని, వంశీ మోహన్. కెసిఆర్ అమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపధ్యంలో ఎన్టీఆర్ సినిమా ఆడియోని కూడా అడ్డుకుంటే తమ సత్తా చాటి చెప్పుకున్నట్టవుతుందని తెలంగాణ విద్యార్థి సంఘాలు భావించాయట. ఈ వ్యూహాన్ని కనిపెట్టిన పోలీసులు రెండు లారీల్లో కుకట్ పల్లి నుంచి వస్తోన్న విద్యర్దులను అడ్డుకున్నారని తెలుస్తోంది. కొడాలి నాని కూడా తన పవర్ నంతా ఉపయోగించి ఈ ఆడియో కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకున్నాడని సమాచారమ్.


Click it and Unblock the Notifications











