జూ ఎన్టీఆర్ 'అదుర్స్' రిలీజ్ ఆగినట్లేనా!?
జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్లో రెడీ అయిన అదుర్స్ చిత్రం రిలీజ్ ఆగినట్లేనని సమాచారం. తెలంగాణకు వ్యతిరేకంగా జూనియర్ జూ ఎన్టీఆర్ తండ్రి, హరికృష్ణ వ్యవహిస్తున్నారంటూ తెలంగాణలో అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థుల సంఘం జెఎసి ఇప్పటికే ప్రకటించారు. దాంతో తెలుగు నిర్మాతలు కొందరు అత్యవసర సమావేశం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రసుత్తం నడుస్తున్న రాజకీయ అనిశ్చితి సర్ధుమణిగే వరకూ ఏ చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సిన అదుర్స్, కాస్కో,లీడర్ విడుదల తేదీలు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, శేఖర్ బాబు, మోహన్ బాబు, బివియస్ ఎన్ ప్రసాద్, వల్లభనేని వంశీ, కోదండరామిరెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో సినిమాలకూ, రాజకీయాలకూ సంభందం లేదని రెండింటినీ కలపవద్దని విజ్ఞప్తి చేసారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు(16 డిసెంబర్) మరోసారి పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ లు వారితో మరో మీటింగ్ ఉంటుంది. ఇక ఇప్పటికే ఆర్య-2 ని తెలంగాణ జిల్లాల్లో ప్రదర్శన ఆపుచేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











