మళ్ళీ ఎన్టీఆర్ అదుర్స్ డిలే

ద్విపాత్రల్లో ఈ చిత్రంలో ఎన్టీఆర్ కన్పించనున్నట్లు సమాచారం. అలాగే కోనవెంకట్ ప్రత్యేకంగా తన కథల్లో రూపొందించే బ్రహ్మానందం ఎపిసోడ్ ఈ చిత్రంలోనూ పేలనుందని సమాచారం. బ్రహ్మానందం ఈ అదుర్స్ లో పూజారిగా కన్పిస్తారు. ఎన్టీఆర్ ఆయన అసిస్టెంట్ గా కన్పిస్తారు. అలాగే సింగ్ ఈజ్ కింగ్ తరహా అమాయకుడు..డాన్ అవటం వంటి కామెడీ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో చోటు చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో నలుగుతోంది. పూర్తి స్ధాయి ఎంటర్టైన్ మెంట్ గా వివి వినాయిక్ దీన్నితీర్చి దిద్దటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన గత సంక్రాంతికి రిలీజ్ చేసిన కృష్ణ పద్దతిలోనే ప్రేక్షకులను అలరిస్తుందని అభిమానుల ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











