బాలయ్య గాలానికి చిక్కిన జూ ఎన్టీఆర్ హీరోయిన్...
అల్లరి రాముడు"లో చేసిన ఆర్తి అగర్వాల్ 'పలనాటి బ్రహ్మనాయుడు" పంచన చేరింది. 'సింహాద్రి" లో చేసిన అంకిత 'విజయేంద్ర వర్మ" కు కావాల్సొచ్చింది. 'నాగ" లో చేసిన సదాకి 'వీరభద్ర" తో సహవాసం కుదిరింది. 'రాఖీ" లో చేసిన ఛార్మి 'అల్లరి పిడుగు" కి అవసరమయింది. 'యమదొంగ" లో చేసిన ప్రియమణికి 'మిత్రుడు" నుంచి పిలుపొచ్చింది. 'అదుర్స్"లో చేసిన నయనతార 'సింహా"కి జతకట్టింది.
ఇలా ఎప్పటికప్పుడు అబ్బాయ్ సరసన అదరగొట్టిన భామలకు బాబాయ్ ఆహ్వానం అందుతున్నట్టుగానే ఈసారి షీలాకి పడింది గాలం. అబ్బాయ్ సరసన అందాల ఆరబోతలో 'అదుర్స్" అనిపించుకున్న షీలాని 'పరమవీరచక్ర"లో ఓ కథానాయికగా తీసుకునేందుకు అంగీకరించిన బాలయ్య ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆమెతో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నారు. కాగా 'పరమవీరచక్ర" లో అనుష్కే ప్రథాన కథానాయికనీ, హన్సిక చేస్తుందనుకున్న పాత్రకి షీలాని తీసుకున్నారనీ తెలిసింది..!


Click it and Unblock the Notifications











