Don't Miss!
- News హరీశ్.. రాజీనామా చేతిలో పెట్టుకో: మామ అల్లుళ్లపై రేవంత్ ఫైర్, వరంగల్‌కు కీలక హామీలు
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ ‘అదుర్స్’ అంటున్న నందమూరి, నారావారి కుటుంబం
ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్వకత్వంలో రూపొందిన 'అదుర్స్" సినిమా ప్రత్యేక షోని బాలకృష్ణ వీక్షించాడు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ - 'తారక్ నటన పరంగా బాగా విజృంభించాడు. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్ అంతా బాగా చేశాడు. సినిమా బాగుంటే చూస్తామని స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రేక్షకులు నిరూపించారు. సినిమా చాలా బాగుంది. ఇంకొన్ని ప్రింట్లు కూడా పెంచబోతున్నారు. వినాయక్ యాక్షన్, కామెడీ రెండూ బాగా చేశాడు. ఎక్కువ ఆనందాన్నిచ్చే ఎంటర్టైన్ మెంట్ సినిమా 'అదుర్స్". దాన్నెవరూ ఆపలేరు" అన్నారు.
ఈ నందమూరి ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్" చిత్రాన్ని చూడటానికి నందమూరి హీరోలు తరలి వచ్చారు. బాలకృష్ణ, తారకరత్న, కళ్యాణ్ రామ్ లతో పాటు బాలకృష్ణ భార్య వసుంధర ఈ చిత్రాన్ని వీక్షించారు. అలాగే నారా కుటుంబం కూడా ఈ చిత్రాన్ని వీక్షించింది. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరీదేవి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ తదితరులు ఈ చిత్రాన్ని చూశారు. మొత్తానికి ఇటు నందమూరి అటు నారావారు ఈ చిత్రాన్ని చూసి తామంతా ఒకటేనని నిరూపించుకున్నారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ 'అదుర్స్" అద్భుతంగా ఉందన్నారు. ఎంతో బాగా తీసారన్నారు. సిన్మాలపై ఎలాంటి రాజకీయవత్తిడిలు ప్రయోగించరాదన్నారు. జూ.ఎన్టీఆర్ తాను ఈ గడ్డలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మరణిస్తానన్నాడు. ఇలా చెప్పుకున్నాకకూడా చిత్రంపై నిషేదం విధించినట్టుగా కొన్ని జిల్లాల్లో ప్రవర్తించడం మంచిదికాదన్నారు. సమైక్యాంధ్ర ఎక్కువకాదు తెలంగాణ తక్కువ కాదు వాటి విషయం చూడాల్సింది రాజకీయ నాయకులు నేనుకాదు అని జూ ఎన్టీఆర్ చెప్పాడు. చెప్పుకున్నా ఇంకా చిత్రప్రదర్శనలపై కన్నెర్ర చేయడం మంచిది కాదన్నారు. చిత్రం ఇంటిల్లి పాది చూసుకునేదిలా ఉందని బాగుందని చంద్రబాబు తెలిపారు.