For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ అదుర్స్, వెంకటేష్ నమో వెంకటేశ ఆడియో రిలీజ్ డేట్స్

    By Srikanya
    |

    ఎన్టీఆర్, వివివినాయిక్ కాంబినేషన్లో రెడీ అయిన అదుర్స్ చిత్రం ఆడియో పంక్షన్ ని డిసెంబర్ మూడున శిల్పకళా వేదికలో జరపటానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్వి పాత్రలలో కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన షీలా, నయనతార కనిపించనున్నారు. డిసెంబర్ నెలఖారులో ఈ చిత్రం రిలీజ్ అవనుంది.

    ఇక వెంకటేష్ హీరోగా శ్రీను వైట్ల రూపొందించిన నమో వెంకటేశ చిత్రం ఆడియో డిసెంబర్ 13 న రిలీజ్ కానుంది. ఆ రోజు వెంకటేష్ పుట్టిన రోజు కావటంతో ఆ రోజు ఈ చిత్రం ఆడియో పంక్షన్ ప్లాన్ చేసారు. ఇక ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14, 2010 లో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన త్రిష నటించింది. బ్రహ్మానందం ప్యారిస్ ప్రసాద్ పేరుతో మరో కీలకమైన పాత్రను పోషించారు. అలాగే ఆకాష్ కూడా కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X