twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ అదుర్స్ రిలీజ్ డేట్

    By Srikanya
    |

    ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్లో రెడీ అవుతున్న అదుర్స్ చిత్రం డిసెంబర్ 18న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం ఆడియో నవంబర్ ఇరవైన విడుదలకానుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే అతనికి జోడీగా నయనతార, షీలా కనిపించనున్నారు. అంతేగాక రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ సరసన చేసిన ఛార్మి ఈ చిత్రం కోసం ఓ హాట్ ఐటం సాంగ్ లో కనిపించనుంది. వీటికి తోడు ఒక్కనున్నాడు చిత్రంలో విలన్ గా చేసిన మహేష్ ముంజ్రేకర్ ఇందులో విలన్ గా చేస్తున్నారు. బి.వంశి మోహన్, కొడాలి నానితో కలిసి వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రం అనంతరం దిల్ రాజు నిర్మించనున్న బృందావనం చిత్రంలో బిజీ కానున్నాడు. ప్రబాస్ తో మున్నా చిత్రం చేసిన పైడిపల్లి వంశి ఈ చిత్రాన్ని డైరక్టే చేస్తున్నాడు. ఇదేకాక మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రంలో చేస్తున్నాడు. శక్తి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో గతంలో కంత్రి చిత్రం వచ్చింది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతాయని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X