నందమూరి హీరోల మధ్య క్రాష్!
జూనియర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వినాయక్ తెరకెక్కించిన 'అదుర్స్" డిసెంబర్ 25న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దించడంకన్నా, ముందే రిలీజ్ చెయ్యడం బెటరన్న కోణంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేసేందుకు నిర్మాత ప్లార్ చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య 'సింహా" సంక్రాతికి విడుదలవుతుండడంతో, నందమూరి హీరోల మధ్య క్రాష్ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కి వున్న ఫాలోయింగ్, వినాయక్ కి కమర్షియల్ డైరెక్టర్ గా వున్న పేరు ప్రఖ్యాతులు వెరసి, సినిమాని వెయ్యికి పైగా ప్రింట్లతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట నిర్మాత వల్లభనేని వంశీ. డిసెంబర్ మొదటి వారంలో 'అదుర్స్" ఆడియో విడుదల కానుంది. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ భారీ అంచనాలతో వున్నాడు.
అదుర్స్ జూనియర్ ఎన్టీఆర్ నయనతార వినాయక్ బాలయ్య సింహా వల్లభనేని వంశీ adurs jr ntr nayanatara v v vinayak balakrishna vallabhaneni vamsi


Click it and Unblock the Notifications