'షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2010' విజేతలు వీరే
హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ హైదరాబాద్ 2010 ముగింపు ఉత్సవం మంగళవారం రవీంద్రభారతిలో జరిగింది. షార్ట్ ఫిలిం విభాగంలో...ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో ప్రదర్శించిన అద్వైతం (తెలుగు) బెస్ట్ ఫిల్మ్ ఆఫ్‌ది ఫెస్టివల్‌గా ఎంపికయ్యింది. దీనికి రూ.50 వేలు నగదు, షీల్డ్ ను అందజేశారు. షార్ట్ ఫిలిం కేటగిరిలో పిస్తుల్య (మరాఠి) ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఎన్.రామదాస్, విజయ్ కృష్ణ దర్శకత్వంలోని ఓ జోగిని ఆత్మకథ (తెలుగు) ద్వితీయ స్థానంలో నిలిచింది. షార్ట్ ఫిలిం కేటగిరిలో ఉత్తమ దర్శకుడిగా వినోచోలి పరంబలి ఎంపికయ్యారు.
ఇక...డాక్యుమెంటరీ విభాగంలో-ఇన్ సెర్చ్ ఆఫ్ మై హోం ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచింది. ద్వితీయ బహుమతిని అన్‌సీన్ బ్యూటీ అన్ హిడెన్ ట్రూత్ దక్కించుకుంది. ఉత్తమ దర్శకునిగా సుస్మిత్ గోష్, రింటూ థామస్ ఎంపికయ్యారు. ఈ పోటీలకు మొత్తం 280 ఎంట్రీలు రాగా, వాటిలో 47 పోటీలకు ఎంపికయ్యాయి. వాటిలో 14 బహుమతులను దక్కించుకున్నాయి. మరో 48ని నాన్ కాంపికేషన్ కేటగిరిలో ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామానాయుడు విజేతలకు బహుమతులు అందజేశారు.


Click it and Unblock the Notifications











