షాకిస్తున్న అల్లు అర్జున్ బర్త్ డే పోస్టర్.. ముఖంపై అవి గమనించారా, ఆ వేడుక అప్పుడే!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. నాపేరు సూర్య చిత్రం వక్కంతం వంశి దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మిలటరీ మాన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఫస్ట్ ఇంపాక్ట్ లోనే యాక్షన్ సన్నివేశాలని బలంగా చూపించి అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. కాగా ఈ చిత్రం మే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. త్వరలో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైం పోస్టర్ ని విడుదల చేసింది.

త్వరలో బన్నీ బర్త్ డే
త్వరలో అల్లు అర్జున్ పుటిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నాడు. ఏప్రిల్ 8 న బన్నీ 35 వ పడిలోకి అడుగుపెడతాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బన్నీని విష్ చేస్తూ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసింది.

15 ఇయర్స్ ఇండస్ట్రీ
ఇటీవల అల్లు అర్జున్ సినీ ప్రవేశం చేసిన 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల క్రితం బన్నీ గంగోత్రి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 15 ఏళ్ళతో బన్నీ నటుడిగా ఎదుగుతూ భారీ క్రేజ్ ఏర్పరుచుకున్నారు.

నా పేరు సూర్య చిత్రంతో
అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆడియో వేడుక అప్పుడే
ఈ చిత్ర ఆడియో వేడుక ఏప్రిల్ 15 న నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఆడియో వేడుక వేదికని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. హైదరాబాద్, వైజాగ్ మరియు తిరుపతి వంటి ప్రధాన నగరాలని పరిశీలిస్తున్నారు.

కుటుంబం కంటే దేశమే ఎక్కువ
కుటుంబం కంటే దేశాన్నే ఎక్కువగా ప్రేమించే ఆర్మీ అధికారి కథ ఇది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

షాకిస్తున్న బర్త్ డే పోస్టర్
తన ప్రతి చిత్రంలో కమర్షియల్ అంశాలు ఉంటూనే తన పాత్రలో ప్రత్యేకత ఉండాలని బన్నీ భావిస్తాడు. నా పేరు సూర్య చిత్రంలో బన్నీ కొత్త లుక్ అభిమానులని తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన బర్త్ డే పోస్టర్ ఆసక్తిని రేపుతోంది. బన్నీ ముఖంపై ఇండియాలో ప్రధాన నగరాలను పేర్లని పొందుపరిచారు. బోర్డర్ లో ఆర్మీ యాక్షన్ సన్నివేశాలతో పేరు ప్రధాన నగరాలలో మిలటరీ ఆపరేషన్ వంటి సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











