‘రభస’ అడ్వాన్డ్స్ బుకింగ్...జోరుమీదున్న ఫ్యాన్స్

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రభస' చిత్రం ఈ నెల 29న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1200 స్క్రీన్లలో విడుదలవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల 'రభస' చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు నుండే మొదలైంది.

ఎన్టీఆర్ అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. బుకింగ్ ఓపెన్ అయిన ఆరు గంటల్లోనే 25% టిక్కెట్లు బుక్కయిపోయాయి. దీంతో పాటు విడుదలకు ఒక రోజు ముందుగానే పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. సాధారణ షోల రేటుకంటే బెనిఫిట్ షో టిక్కెట్ల రేటు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయితే వీరాభిమానులు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు.

Advance Ticket Booking For NTR's Rabhasa In Full Swing

ఎన్టీఆర్ సినిమాకు ఫస్ట్ డే టిక్కెట్లు సంపాదించడం అంటే కాస్త కష్టమైన విషయమే. టిక్కెట్లు సంపాదించడానికి అష్టకష్టాలు పడిన అభిమానులు టిక్కెట్లు తమ చేతికి రాగానే చాలా రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. టిక్కెట్లు దొరికిన విషయాన్ని సోషల్ మీడియాలో గొప్పగా ప్రకటించుకుంటున్నారు. శరత్ కన్నెడి అనే ఎన్టీఆర్ అభిమాని ఈ విషయమై ట్వీట్ చేస్తూ....'హమ్మయ్య...రభస టిక్కెట్లు దొరికాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకే సినిమా చూడబోతున్నాం' అంటూ సంతోషంగా ప్రకటించాడు.

రామ్ అనే మరో అభిమానపి ట్వీట్ చేస్తూ...'టికెట్ దాదా సైట్ దెబ్బకు డౌన్ అయింది. కానీ నేను మాత్రం టిక్కెట్లు సంపాదించగలిగాను' అంటూ ట్వీట్ చేసారు. కిరణ్ కుమార్ సి అనే అభిమాని ట్వీట్ చేస్తూ...'టిక్కెట్లు దొరికిన తర్వాత ఎంతో రిలాక్స్‌గా ఫీలవుతున్నాను' అంటూ ట్వీట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X