Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రిపోర్ట్ లీక్: ఐష్-రణబీర్ మూవీలో బూతులు, ముద్దు సీన్లు కట్
ముంబై: కరణ్ జోహార్ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ఐశ్వర్యరాయ్.
ఐశ్వర్యరాయ్‌ని గ్లామరస్ గా, రొమాంటిక్ సీన్లలో చూసి చాలా ఏళ్లయంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. కూతురు ఆరాధ్య కాస్త పెద్దయ్యాక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఐశ్వర్యరాయ్... అన్నీ లేడీ ఓరియెండ్ సినిమాలే చేస్తూ వచ్చారు. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు కూడా. అందుకే ఈ సారి ఐశ్వర్యరాయ్ రూటు మార్చారు. యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ తో హాటుగా, ఘాటుగా రొమాన్స్ చేసారు.
భారీ అంచనాలు
సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా... అన్నింటిలోనూ ఐష్-రణబీర్ రొమాన్స్ హైలెట్ చేస్తూ సినిమాకు పబ్లిసిటీ బాగా పెంచారు. అసలు ఐశ్వర్యరాయ్, రణబీర్ తో ఇలాంటి సీన్లు చేస్తుందని ఎవరూ ఊహించలేదు, కొందరు షాకయ్యారు కూడా...
సెన్సార్ రిపోర్ట్ లీక్
దర్శకుడు కరణ్ జోహార్ సినిమాను ఘాటైన రొమాంటిక్ సీన్లు, డైలాగులతో నింపేసారు. అయితే సెన్సార్ బోర్డ్ వీటికి కత్తెర వేసింది. సెన్సార్ సర్టిఫికెట్తో పాటు సన్నివేశాలను కట్ చేసిన పత్రాలు లీక్ అవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ఏమేం కట్ చేసారంటే?
కట్ చేసిన సన్నివేశాల్లో రణ్‌బీర్, ఫవాద్, అనుష్కల మధ్య ముద్దు సన్నివేశాలు దాదాపు సగం తొంలగించారు. రణ్‌బీర్ చెప్పే మూడు బూతు డైలాగులను తొలగించారు.
కరణ్ జోహార్ అబద్దం చెప్పాడా?
గతంలో ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ...సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలు లేవని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే సెన్సార్ రిపోర్టులో మాత్రం ముద్దు సీన్లు ఉన్నట్లు, అందులో కొన్ని కట్ చేసినట్లు ఉంది. ఈ విషయంలో కరణ్ జోహార్ అబద్దం చెప్పినట్లు స్పష్టమవుతోంది.
షాకింగ్ ఓల్డ్ ఫోటో: ఆ పిల్లాడే... ఇపుడు ఐశ్వర్యరాయ్‌తో రొమాన్స్!
షాకింగ్ ఓల్డ్ ఫోటో: ఆ పిల్లాడే... ఇపుడు ఐశ్వర్యరాయ్‌తో రొమాన్స్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ట్రైలర్ ఇదే..
ట్రైలర్ ఇదే..