twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాన్స్, హారర్ కూడిన ‘ఎఫైర్’ (ట్రైలర్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో భీమవరం టాకీస్ బేనర్ పై రూపొందుతున్న చిత్రం ‘ఎఫైర్'. శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ మంగళవారం విడుదల చేసారు. లెస్పియన్స్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హారర్ అంశాలను కూడా జోడించారు.

    Affair song teaser launch

    ఈ చిత్రంలో నటిస్తూ దర్శకత్వం కూడా చేస్తున్న శ్రీరాజన్ మాట్లాడుతూ... ఏదైనా డిపరెంట్ కథ కథ చేయాలని అనుకోగానే హీరో స్థానంలో ఒక లేడీని పెట్టి లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా కథ తయారైంది. ఈ కథలో ఎవరు నటిస్తారని వెతుకుతుండగా ప్రశాంతి, గీతాంజలి కథ వినగానే ఏ మాత్రం ఆలోచించకుండా సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. ఇదో మంచి లవ్ స్టోరీ, ఎక్కడా వల్గారిటీ ఉండదు అన్నారు.

    ఈ చిత్రంలో ధనరాజ్, రాకేష్, సాయి రాజ్, షాని సాల్మోన్, పుచ్చా రామకృష్ణ, హరిత, ఫణి, సంపత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డైలాగ్స్: అనిల్ సిరిమల్ల, మ్యూజిక్: శేషు కెఎంఆర్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్.

    English summary
    Affair song teaser launched.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X