జయంత్ దర్శకత్వంలో నందమూరి నటసింహా...!?
బాలకృష్ణ హీరోగా జయంత్ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీనరసింహా" చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించిన విషయం విధితమే. లక్ష్మీ నరసింహా, అల్లరి పిడుగు వంటి సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే జయంత్ బాలకృష్ణకు ఓ స్టోరి లైన్ వినిపించగా దానికి ఇంప్రెస్ అయిన బాలకృష్ణ కథని మరింత డెవలప్ చేయ్యమని చెప్పాడట. ప్రస్తుతం జయంత్ ఈ స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ పరుచూరి మురళీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అధినాయకుడు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తయ్యాక జయంత్ ప్రాజెక్ట్ వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More from Filmibeat
balakrishna jayant c paranji lakshmi narasimha allari pidugu బాలకృష్ణ జయంత్ సి పరాన్జీ లక్ష్మీ నరసింహా అల్లరి పిడుగు


Click it and Unblock the Notifications











