»   » ఏం జరుగుతోంది? అఖిల్ పెళ్లిపై నాగ చైతన్య సంచలన ప్రకటన!

ఏం జరుగుతోంది? అఖిల్ పెళ్లిపై నాగ చైతన్య సంచలన ప్రకటన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరోలు నాగ చైతన్య, అఖిల్ పెళ్లి గురించి కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తాను ప్రేమించిన సమంతను పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఇక అఖిల్ కూడా శ్రీయా గోపాల్ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోబోతోన్నాడు.

ఇటీవల నాగార్జున అఖిల్ పెళ్లి విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు. డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరుగుతుందని, వచ్చే ఏడాది పెళ్లి జరుగుతుందని తెలిపారు. నాగ చైతన్య-సమంత ఎప్పుడు రెడీ అంటే అప్పుడు తాను వివాహం చేయడానికి సిద్ధమని తెలిపారు. అయితే నాగ చైతన్య పెళ్లి తర్వాతే అఖిల్ వివాహం ఉంటుందని స్పష్టం చేసారు.

నాగ చైతన్య ఇలా అన్నాడేంటి?

నాగ చైతన్య ఇలా అన్నాడేంటి?

తాజాగా నాగ చైతన్య తన వివాహం విషయంలో చేసిన ఓ ప్రకటన హాట్ టాపిక్ అయింది. ముందు అఖిల్ పెళ్లి జరుగుతుందని, తర్వాతే నేను, సమంత పెళ్లి చేసుకుంటలామని చైతన్య ప్రకటించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు.

పెళ్లి తర్వాత కూడా సమంత

పెళ్లి తర్వాత కూడా సమంత

పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో కొనసాగుతుందని, హీరోయిన్ గా నటిస్తుందని నాగ చైనత్య తెలిపారు. అయితే మీ వివాహం ఎందుకు లేటవుతుందనే విషయంలో మాత్రం నాగ చైతన్య వివరణ ఇవ్వలేదు.

అఖిల్ ఆగడం లేదా? నాగ చైతన్య కావాలనే లేట్ చేస్తున్నాడా?

అఖిల్ ఆగడం లేదా? నాగ చైతన్య కావాలనే లేట్ చేస్తున్నాడా?

సాధారణంగా ఏ ఇంట్లో అయినా పెద్ద కుమారుడి వివాహం ముందు జరుగుతుంది. అయితే అక్కినేని ఫ్యామిలీలో ఇలా జరుగుతుండటం హాట్ టాపిక్ అయింది. అఖిల్ ఆగడం లేదా? లేక నాగ చైతన్య-సమంత కావాలనే వివాహం విషయంలో లేట్ చేస్తున్నారా? అనేది చర్చనీయాంశం అయింది.

సమంత మతం గురించి

సమంత మతం గురించి

నాగ చైతన్య స్పందన సమంత మతం మార్చుకుందనే వార్తలపై నాగ చైతన్య స్పందించాడు. ఈ వార్తలు రావడానికి కారణమైన సదరు ఫోటోలపై కూడా చైతూ వివరణ ఇచ్చాడు. మతం మార్చుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం, తమకు అలాంటి అవసరం కూడా లేదని స్పష్టం చేసాడు.

ఆ ఫోటోస్ ఏమిటి?

ఆ ఫోటోస్ ఏమిటి?

సమంత మతం మార్చుకున్నట్లు ప్రచారమవుతున్న ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోలో పూజకు సంబందించినవే తప్ప... మతం మార్చుకోవడాల్లాంటివేమీ జరుగలేదని నాగ చైతన్య స్పష్టం చేసారు. దీనిపై అనవసర రాద్దాందం చేయొద్దన్నారు.

ఇంకా ఏదీ జరుగలేదు

ఇంకా ఏదీ జరుగలేదు

నిశ్చితార్థం జరుగేలేదు కొందరు ఈ ఫోటోలు చూసి మాకు నిశ్చితార్థం జరిగిందని అంటున్నారు. అందులో కూడా వాస్తవం లేదు. మాకు నిశ్చితార్థం జరుగలేదు, సమంత మతం కూడా మార్చుకోలేదు.... మేము పెళ్లి చేసుకుంటున్నాం అని ప్రకటించాం. అలాంటపుడు నిశ్చితార్థం రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని నాగ చైతన్య తేల్చి చెప్పారు.

అలాంటి పట్టింపులు

అలాంటి పట్టింపులు

మతం పట్టింపులు లేవు మా ఇద్దరికీ మతం పట్టింపులు లేవు. మాలో అలాంటి ఉద్దేశ్యం ఉంటే మా బంధం మేము ఇక్కడికి వరకు వచ్చేదే కాదు. మాకు ఏ మతమైనా ఓకే అని. వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించడం, గౌరవించడం చేస్తాను తప్ప మతం మార్చుకోమనడమో, ఇంకేదో లాంటి కండిషన్స్ పెట్టనని చైతు స్పష్టం చేసారు.

సమంతతో ప్రేమ

సమంతతో ప్రేమ

‘ఏమాయ చేసావే' సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే ‘బెస్ట్ ఫ్రెండ్స్'గా మారిపోయామని, ఆ స్నేహమే ఒకరిపై ఒకరికి మరింత ఇష్టాన్ని పెంచింది. తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని చైతూ చెప్పుకొచ్చారు.

వేరే అమ్మాయిని ఊహించుకోలేదు

వేరే అమ్మాయిని ఊహించుకోలేదు

సమంత తప్ప వేరే అమ్మాయి గుర్తు రాలేదు మేము ఇంతకాలం స్నేహం చేసామా? ప్రేమలో ఉన్నామా? అంటే చెప్పడం కష్టమే. మేము ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయని ఊహిచుకోలేకపోయాను అని చైతు తెలిపారు.

సమంతకు నేను ప్రోజ్ చేసా

సమంతకు నేను ప్రోజ్ చేసా

ఇంతకాలం మా మధ్య స్నేహం ఉంది. సమంత అంటే ఇష్టం. ఆమెతో అన్ని విషయాలు పంచుకునే చనువు ఉంది. పెళ్లి ఆలోచన వచ్చింది ఈ ఏడాదే. నాకు సమంత అంటే ఇష్టం. నేరుగా వెళ్లి ఆమెను ఎన్ని రోజులు బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటాం. పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది... అని సమంతకు చెప్పినట్లు చైతు వెల్లడించారు.

English summary
"After Akhil marriage We will married" Naga Chaitanya said in a recent interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X