శింబుతో కలిసి దేశీలుక్‌లో పాప్ సింగర్ అకోన్ (ఫోటోలు)
చెన్నై: తమిళ నటుడు శింబు కోసం ఇంటర్నేషనల్ సింగ్ అకోన్ చెన్నైకి వచ్చాడు. పంచెకట్టి దేశీలుక్‌లో సందడి చేసాడు. శింబు రూపొందిస్తున్న 'లవ్ అంథెమ్' అనే ఆల్బమ్ కోసం పాటపాడటానికి అకోన్ ఇక్కడికి వచ్చాడు. 2011లో ప్రేమికుల రోజు సందర్భంగా శింబు స్వయంగా రాసి పాడిన లవ్ ఆంథెమ్ ఆల్బమ్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో లవ్ అంథెమ్ గ్లోబల్ వెర్షన్‌ను ప్లాన్ చేసాడు శింబు. ఇందులో అకోన్‌తో పాడించడం ద్వారా తనకు ఇంటర్నేషనల్ గుర్తింపు వస్తుందని శింబు ఆశిస్తున్నాడు. ఈ ఆల్బమ్ లో అకోన్ సౌతిండియన్ దేశీ లుక్‌లో సందడి చేయనున్నాడు. ఇటీవలే ఈ ఆల్బం రికార్డింగ్ చెన్నైలో జరిగింది.
ఇక్కడ వినిపిస్తున్న మరో ఆసక్తికర వార్త ఏమిటంటే ఈ ఆల్బంలో ఇంటర్నేషనల్ ఫిమేల్ సింగర్ 'రిహానా' కూడా పాలుపంచుకోనుందని తెలుస్తోంది. త్వరలో ఆమె చెన్నై వచ్చి ఆల్బం రికార్డింగులో పాల్గొంటుందని శింబు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

శింబుతో కలిసి అకోన్

లవ్ అంథెమ్ అనే ఆల్బంలో శింబుతో కలిసి అకోన్ ఆడి పాడుతున్నాడు.

ఇందులో అకోన్ సౌతిండియా దేశీలుక్‌లో సందడి చేయబోతున్నాడు.

ఈ ఆల్బం ద్వారా ఇంటర్నేషనల్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి శింబు ప్రయత్నిస్తున్నాడు.

శింబు ఫ్యామిలీతో కలిసి అకోన్

శింబుతో కలిసి అకోన్ స్టెప్పులు

అకోన్ ద్వారా ఈ ఆల్బమ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

ఈ ఆల్బంలో మరో ఇంటర్నేషనల్ సింగర్ రిహానా కూడా పాడనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











