twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమర్ అక్బర్ ఆంటోని ఎఫెక్ట్: పవన్‌తో అనుకున్నారు, రవితేజతో కూడా.. చేతులెత్తేసిన మైత్రి!

    |

    ఒకప్పుడు రవితేజ నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరో. సినిమా కాస్త యావరేజ్‌గా ఉన్నా చాలు. నిర్మాతలకు రవితేజ సినిమాల నుంచి కాసుల వర్షం కురిసేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రవితేజ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఇటీవల రవితేజ నటించిన చిత్రాలు దారుణంగా విఫలం అవుతున్నారు. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు తీవ్రంగా నిరాశపరచడంతో ప్రస్తుతం ఈ మాస్ హీరో వత్తిడిలో ఉన్నాడు. రవితేజ తదుపరి చిత్రాల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

    అమర్ అక్బర్ ఆంటోని ప్రభావం

    అమర్ అక్బర్ ఆంటోని ప్రభావం

    శ్రీనువైట్ల దర్శత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం రవితేజ కెరీర్‌పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ మూడు పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆడియన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా రవితేజ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. దీనితో రవితేజ తదుపరి చిత్రాల నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.

    పవన్ కళ్యాణ్‌తో అనుకున్నారు

    పవన్ కళ్యాణ్‌తో అనుకున్నారు


    ఇళయ దళపతి విజయ్ నటించిన తేరి చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించాలని మైత్రి మూవీస్ సంస్థ భావించింది. పవన్‌కు తగ్గట్లుగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కూడా కథ సిద్ధం చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ చిత్రం కుదర్లేదు. తేరి చిత్రాన్ని తమిళంలో యువ దర్శకుడు అట్లీ రూపొందించిన సంగతితెలిసిందే.

     రవితేజ సీన్‌లోకి వచ్చాడు

    రవితేజ సీన్‌లోకి వచ్చాడు

    పవన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం రవితేజ సీన్‌లోకి వచ్చాడు. రవితేజ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించడానికి మైత్రి మూవీస్, సంతోష్ శ్రీనివాస్ సిద్ధం అయ్యారు. కొన్ని కారణాల వలన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అంతకంటే ముందుగా మైత్రి మూవీస్ సంస్థ రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దారుణంగా విఫలం చెందడంతో తేరి రీమేక్ పై కూడా ప్రభావం పడ్డట్లు తెలుస్తోంది. రవితేజతో ఈ చిత్రాన్ని నిర్మించే నిర్ణయాన్ని మైత్రి సంస్థ విరమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఫ్యాన్స్‌కు హుషారెత్తించే వార్త.. బన్నీ సినిమా గురించి పుకార్లు, త్రివిక్రమ్ సరికొత్తగా! ఫ్యాన్స్‌కు హుషారెత్తించే వార్త.. బన్నీ సినిమా గురించి పుకార్లు, త్రివిక్రమ్ సరికొత్తగా!

     భారీగా కోత

    భారీగా కోత

    ఇదిలా ఉండగా రవితేజ తదుపరి చిత్రం విఐ ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం విషయంలో కూడా రవితేజకు ఎదురుదెబ్బ ఎదురైనట్లు తెలుస్తోంది. అమర్ అక్బర్ ఆంటోని పరాజయంతో ఈ చిత్ర బడ్జెట్ లో భారీగా కోత పెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారట. అనవసరంగా బడ్జెట్ పెంచొద్దని దర్శకుడికి నిర్మాతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. నేల టికెట్ చిత్రం తరువాత రామ్ తాళ్లూరి మరోమారు రవితేజ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఫలించని ఇలియానా ప్రయత్నం

    ఫలించని ఇలియానా ప్రయత్నం

    అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కేవలం రవితేజ కెరీర్ పైన మాత్రమే కాదు.. దర్శకుడు శ్రీనువైట్ల, హీరోయిన్ ఇలియానాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలియానా చాలా కాలం తరువాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ఇది. బాలీవుడ్ అవకాశాలు కరువవడంతో ఈ చిత్రంపై ఇలియానా ఆశలు పెట్టుకుంది. కానీ అమర్ అక్బర్ ఆంటోని ఫలితం ఇలియానాకు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇక దర్శకుడు శ్రీనువైట్ల ఖాతాలో కూడా మరో దారుణమైన ప్లాప్ చేరింది.

    English summary
    After Amar Akbar Anthony debacle, budget of Ravi Teja's next gets heavily slashed. After churning out three disasters back-to-back, the budget of Ravi Teja's next film has witnessed a huge drop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X