ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త...ఫేస్‌బుక్‌లోకి సల్మాన్ ఖాన్
అందులో పోస్టు చేసిన వీడియోలో సల్మాన్ మాట్లాడుతూ.... 'నా పేరుపై చాలా ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలు ఉన్నాయని చాలా మంది చెప్పారు. అందుకే అభిమానులకు టచ్‌లో ఉండేందుకు నేనే స్వయంగా నేను ఇందులోకి వచ్చాను, మీరు నాతో జాయిన్ కావొచ్చు. అయితే నా పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్లను చూసి మోస పోవద్దు' అని పేర్కొన్నారు.
అక్టోబర్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా వైడ్‌గా హ్యూమన్ స్టోరీస్ తన ఫేస్ బుక్ పేజీలో స్టార్ట్ చేయబోతున్నట్లు సల్మాన్ వెల్లడించారు. (ఇక్కడ క్లిక్ చేసి సల్మాన్ ఫేస్‌బుక్ పేజీలోకి ఎంటర్ అవ్వండి)
ఇక సల్మాన్ సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్, సొనాక్షి సిన్హా జంటగా అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో సల్మాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్ నిర్మించిన 'దబాంగ్' చిత్రం సంచలనాత్మక విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ గా దబాంగ్ 2 చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి నిర్మాత అర్భాజ్ ఖానే దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












