twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాకెట్ స్పీడ్‌తో రానా.. ప్రభాస్ ‘స్లో అండ్ స్టడీ’.. బాహుబలి తర్వాత సీన్ ఇదే..

    By Rajababu
    |

    Recommended Video

    ప్రభాస్.. ఏంటీ స్లో.. రానా చూడు రాకెట్ లా..!

    బాహుబలి ది బిగినింగ్, బాహుబలి2 ది కన్‌క్లూజన్ చిత్రాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ హీరో రానా దగ్గుబాటికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాల కంటే ముందే రానా బాలీవుడ్‌ ప్రేక్షకులకు రానా పరిచయం. కానీ కేవలం బాహుబలితోనే ప్రభాస్ హిందీ, ఇతర రంగాలకు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ ఇద్దరి హీరోలకు సంబంధించిన కెరీర్ గ్రాఫ్ చూస్తే ప్రభాస్ స్లో అండ్ స్టడీలా కనిపిస్తుంటే.. రానా మాత్రం విభిన్నమైన చిత్రాలతో శరవేగంగా దూసుకెళ్తున్నాడు.

     దూసుకెళ్తున్న రానా

    దూసుకెళ్తున్న రానా

    బాహుబలి రిలీజై ఆరునెలలకు పైగా కావోస్తున్నా ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ రానా మాత్రం వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. బాహుబలి తర్వాత ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో రానా ఆలరించాడు. వరుస హిట్ల తర్వాత డిఫరెంట్ కథాంశంతో చిత్రాలను ఎంపిక చేసుకొంటూ జాతీయ మీడియాను ఆకర్షిస్తున్నాడు.

    పక్కా ప్రణాళికతో భల్లాళదేవ

    పక్కా ప్రణాళికతో భల్లాళదేవ

    1945, హాథీ మేరా సాథీ రీమేక్, మరట్వాడా రాజా బయోపిక్ చిత్రాలను రానా దగ్గుబాటి ఇటీవల అంగీకరించాడు. ఈ చిత్రాలను చూస్తే రానా పక్కా ప్రణాళికతోనూ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ మూడు చిత్రాలు కూడా వేటికి అవే విభిన్నంగా కనిపిస్తున్నాయి.

     1945 చిత్రంలో జవాన్‌గా

    1945 చిత్రంలో జవాన్‌గా

    తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న 1945 చిత్రంలో రానా దగ్గుబాటి స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాటం చేసిన సైనికుడిగా నటిస్తున్నాడు. సుభాస్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో జవాన్‌గా కనిపించనున్నారు. 1945 కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది.

     మహారాజు మరట్వాడ వర్మగా

    మహారాజు మరట్వాడ వర్మగా

    రానా అంగీకరించిన చిత్రం అనిజమ్ థిరునాల్ మరట్వాడ వర్మ.. ది కింగ్ ఆఫ్ ట్రావంకోర్'. ఈ చిత్రంలో ట్రావంకోర్ మహారాజు మరట్వాడ వర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కూడా చరిత్ర ఆధారంగా రూపొందుతున్నది.

     హాథీ మేరే సాథీ చిత్రంలో

    హాథీ మేరే సాథీ చిత్రంలో

    1971లో బాలీవుడ్‌లో విశేష ప్రేక్షకాదరణను చూరగొన్న చిత్రం హాథీ మేరే సాథీ. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హీరోగా నటించారు. ఆ ఏడాదిలో బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం ఆ చిత్ర రీమేక్‌లో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. దేశంలోని సినీ అభిమానులందర్ని ఆకట్టుకునే కథా చిత్రంలో నటించాలన్న లక్ష్యంతో సినిమాలను ఎంపిక చేసుకొంటున్నానని రానా ట్వీట్ చేశారు.

     సాహో చిత్రంతో ప్రభాస్

    సాహో చిత్రంతో ప్రభాస్

    ఇక ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి తర్వాత చాలా సమయం తీసుకొని సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే బాహుబలి తర్వాత ఓ ఏడాదికి పైగానే ప్రభాస్ సమయం తీసుకొంటున్నాడు.

    చారిత్రాత్మకంగా చిత్రంగా సాహో

    చారిత్రాత్మకంగా చిత్రంగా సాహో

    మీడియా కథనాల ప్రకారం.. సాహో చిత్రం బ్రిటీష్ పాలిత భారత్‌లో జరిగిన సంఘటనల నేపథ్యంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ చిత్ర కథ స్వాతంత్యానికి పూర్వం, తర్వాత అనే కథాంశంతో రూపొందుతున్నది. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ సినిమా ఏమిటనే ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రూపొందించే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.

    English summary
    After Baahubali, Prabhas, Rana Daggubati become house hold names in Indian film Industry. After Baahubali, Rana selecting like 1945, King of Travancore, Hathi mere Saathi remake. Prabhas is doing only one movie like Saaho.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X