ఇద్దరు పిల్లల తల్లిని అయినా కూడా వేధించాడు.. నటుడిపై సింగర్ సంచలన ఆరోపణ!

పాకిస్తాన్ యువ నటుడు అలీ జాఫర్ బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. అతడిపై సింగర్ మిషా షఫీ (36) సంచలన ఆరోపణలు చేసింది. అలీ జాఫర్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణ చేసింది. తాను ఇద్దరు పిల్లల తల్లిని అని కూడా చూడకుండా తనని తాకరాని చోట తాకుతూ వేదనకు గురిచేశాడని మిషా ఆరోపించింది. ఈ ఆరోపణలు చేస్తూ ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.

దీనిపై నటుడు అలీ జాఫర్ స్పందించారు. మీ టూ ఉద్యమానికి తన మద్దత్తు ఉంటుందని తెలిపాడు. కానీ తాను ఓ పాపకు తండ్రిని అని, తన గురించి స్నేహితులకు, మిత్రులకు బాగా తెలుసు అని అలీ జాఫర్ అన్నాడు. కానీ తన గురించి ఇలాంటి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని జాఫర్ వివరించాడు. అందుకే ఆమెపై న్యాయపరమైన పోరాటానికి దిగుతున్నానని ఆమెకి నోటీసులు పంపించడం విశేషం.

After being accused of sexual harassment by Meesha

అలీ జాఫర్ పాక్ లో పలుచిత్రాల్లో నటించాడు. బాలీవుడ్ లో కూడా అతడు తేరె బిన్ లాడెన్, మేరీ బ్రదర్ కి దుల్హన్ వంటి చిత్రాల్లో నటించడం విశేషం. ప్రస్తుతం అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X