మళ్ళీ ఇంకో రియాలిటీ షోనా..!?: బిగ్ బాస్ తర్వాత ఇది మళ్ళీ మొదలు

2008లో సోనీ టీవీలో ప్రసారమైన 'దస్ కా దమ్' కార్యక్రమం త్వరలో పునఃప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

డ్యాన్స్‌ రియాల్టీ షోకి యాంకర్లగా సినిమా స్టార్స్ వస్తే ఆ క్రేజే వేరు. ముఖ్యంగా టీవి మీడియా మరింత ముందుకు దూసుకుపోతూండటంతో స్టార్స్ తమ క్రేజ్ ని మరింత పెంచుకోవటం కోసం ఈ మీడియాలోకి ప్రవేశించటానికి ఏ మాత్రం సందేహించటం లేదు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో తాను చేసిన షో తర్వాతి భాగానికి కూడా తానే వ్యాఖ్యాత కానున్నాడు...

Recommended Video

Bigg Boss Contestent Zubair Khan Sensational Comments On Salman Khan
 స‌ల్మాన్ ఖాన్

స‌ల్మాన్ ఖాన్

2008లో సోనీ టీవీలో ప్రసారమైన 'దస్ కా దమ్' కార్యక్రమం త్వరలో పునఃప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం 'బిగ్‌బాస్' కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

 2009లో రెండో సీజన్ పూర్తి

2009లో రెండో సీజన్ పూర్తి

2009లో రెండో సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ లో కూడా సల్లూ భాయే హోస్ట్ గా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని సోనీ టీవీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దనీష్ ఖాన్ అనధికారికంగా ప్రకటించారు. ఆ షోకు హోస్ట్ గా చేసే దమ్ము వేరెవరికీ లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

 దస్ కా దమ్

దస్ కా దమ్

'దస్ కా దమ్' కార్యక్రమం వ్యాఖ్యాతగా ఎవరుండబోతున్నారని దనీష్ ఖాన్ ను మీడియా ప్రశ్నించింది. ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేయగల సత్తా ఇంకెవరికైనా ఉందని మీరనుకుంటున్నారా అంటూ ఆయన మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. దనీష్ ఖాన్ పరోక్షంగా సల్మాన్ వ్యాఖ్యాత అని సమాధానమిచ్చాడని మీడియా భావిస్తోంది.

మొబైల్ ఇంటరాక్టివ్

మొబైల్ ఇంటరాక్టివ్

సోనీ టీవీలో ప్రసారమవుతున్నపుడే ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా మొబైల్ ఇంటరాక్టివ్ టెక్నాలజీని ఈసారి అందుబాటులోకి తీసుకురానున్నట్లు దనీష్ ఖాన్ చెప్పారు. 2008లో ప్రసారమైన ఈ కార్యక్రమంతోనే సోనీ టీవీ తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. ఈ షో తర్వాత సోనీ టీవీ భారతీయ టెలివిజన్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X