చిరు, పవన్ రేంజ్లో అల్లరి నరేష్ అలరిస్తాడా?
చాయ్ చటుక్కున తాగగా బాయ్... అంటూ చిరంజీవి పాడిన పాట ఏ రేంజిలో ప్రేక్షకులను ఊర్రూతలూగించిందో కొత్తగా చెప్పర్కేదు....ఇక పవన్ కళ్యాణ్ తరచూ తన సినిమాల కోసం పాటలు పాడుతూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇతర హీరోలు కూడా తమ స్వరాల్ని వినిపించారు.
తాజాగా అల్లరి నరేష్ కూడా....పాటగాళ్ల లిస్టులో చేరబోతున్నాడు. త్వరలో తాను నటించబోయే సుడిగాడు చిత్రంలో సాంగు సింగబోతున్నాడు. మరి సుడిగాడు పాటగాడిగా మెప్పిస్తాడా? చిరు, పవన్ రేంజిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ తమిళ 'పడం' రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్(హాస్య ప్రసంగము)లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం 2012 వేసవికి విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంతో పాటు అల్లరి నరేష్ ని నెల తక్కువోడు అనే చిత్రం కూడా చేస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎలాంటి పబ్లిసిటీ మరియు హైప్ లేకుండా దూరంగా ఉంది. ఈ చిత్రం కోసం కొత్త హీరొయిన్ ని తీసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











