కండోమ్‌తో పాటు సెల్ ఫోన్.... సన్నీ హల్‌చల్
తాజాగా సెల్ ఫోన్ల మార్కెట్లోకి కొత్తగా ఎంటరైన Chaze అనే కొత్త మొబైల్ కంపెనీ సన్నీ లియోన్ను ప్రాచార కర్తగా నియమించుకుంది. ఈ కంపెనీ గురించి సన్నీ లియోన్ మాట్లాడుతూ...ఈ మొబైల్ ఫోన్ కంపెనీతో కలిసి పని చేయడం ఎంతో ఎగ్జైట్‌గా ఉంది. ఇందులో అందరికీ నచ్చే ఫీచర్లు ఉన్నాయి. తప్పకుండా దీన్ని ఎక్కువ మంది ఇష్ట పడతారని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.
మ్యాన్ ఫోర్స్ కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ లియోన్ వ్యవహరించడంపై ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శృంగార చిత్రాల్లో అదరగొట్టే సన్నీ లియోన్...కండోమ్ యాడ్‌లో ఏ రేంజిలో ఇరగదీస్తుందో అని, ఎప్పుడెప్పుడు ఆ యాడ్ చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు.
ప్రస్తుతం సన్నీ లియెన్ జిస్మ్ 2 అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అయితే సన్నీకి కొందరు ఇండియన్ నిర్మాతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. మా సినిమాల్లో అవకాశాలు ఇస్తాం, భారీ రెమ్యూనరేషన్ ఇస్తాం, మాతో పొందుకు రావాలని కొందరు ప్రొడ్యూసర్లు అసభ్యంగా వ్యవహరిస్తున్నారట. అయితే తాను నీలి చిత్రాల్లో నటించే తారనే కానీ...వ్యభిచారిని కాదని వార్నింగ్ ఇచ్చి ఇలాంటి వారిని దూరం పెడుతోందట ఈ సెక్సీ లేడీ.


Click it and Unblock the Notifications












