భార్యను వేధించిన కేసులో మరో స్టార్ యాక్టర్

అక్టోబర్ 24న డాలర్స్ కాలనీలో తన భర్త వేరే మహిళతో ఉండటాన్ని గమనించిన శశిరేఖ...అతన్ని పట్టుకుని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అయితే అతను ఆమెనుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ దూకి పారిపోయాడు. వెంటనే ప్రశాంత్‌ను పట్టుకోవాలని, తనకు న్యాయం చేయాలని శశిరేఖ కోరుతోంది. ప్రశాంత్ శశిరేఖల వివాహం 8 సంవత్సరాల క్రితం జరిగింది. వీరికి ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు.
కన్నడ హీరో దర్శన్ గృహ హింస చట్టం కేసులో అరెస్టయి జైలు ఊచలు లెక్క పెట్టిన సంగతి తెలిసిందే. ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న నా భర్త తనపై భౌతిక దాడులకు పాల్పడుతున్నాడని దర్శన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరుసగా గృహ హింస చట్టం కింద సినీతారలు జైలు పాలవుతుండటంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











