మోహన్‌లాల్‌ను టార్గెట్ చేసిన ఆర్మీ?
నిన్న మొన్నటి వరకు వరుస ఐటీ దాడులతో ఉక్కిరి బిక్కిరి అయిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు మళ్లీ తిప్పలు తప్పేట్లు లేవు. అయితే ఈసారి ఆయనకు తలనొప్పులు ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు నుంచి కాదు....ఇండియన్ ఆర్మీ నుంచి. అతనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ అధికారులు సిద్దం అవుతున్నారు. ఆర్మీ మోహన్‌లాల్ ను టార్గెట్ చేయడం ఏమిటి? అని కంగారు పడకండి...ఇదంతగా కంగారు పడాల్సిన విషయం కాక పోయినా సినిమా స్టార్ కు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏమిటా విషయం అనేదేగా మీ డౌట్? ఆ విషయానికే వస్తున్నాం...
మోహన్ లాల్ రెండేళ్ల కింద ఓ అవార్డు అందుకున్నాడు. ఈ మేరకు మద్రాస్ మిలటరీ రీజియన్ నుంచి అతనికి మిలటరీ యూనిఫాం అందింది. ఆ యూనిఫాంను కేవలం ఆర్మీకి సంబంధించిన కార్య్రకమాల్లో మాత్తమే వాడాలి. కానీ నిబంధనలను ఉల్లంఘించిన మోహన్ లాల్ తను నటించే వాణిజ్య ప్రకటన్లో ఆ యూనిఫాంతో దర్శనం ఇచ్చాడు. ఇలా చేయడం ఆర్మీ నిబంధనలను ఉల్లంఘించడం, ఆ యూనిఫాంను అవమానించడమేనట. ఈ మేరకు మోహన్ లాల్ కు ఆర్మీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మోహన్‌లాల్ సినిమా షూటింగుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. అతను ఇండియాకు తిరిగి రాగానే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











