Jr ఎన్టీఆర్ తరువాత నితిన్ కూడా.. మరో రాజకీయ నేతతో భేటి.. ఎప్పుడంటే?

సినీ తారలు అలాగే రాజకీయ ప్రముఖులకు కూడా దగ్గర సంబంధాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ క్రమంలో ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి హీరోలను కూడా భారత జనతా పార్టీ నాయకులు కలుస్తూ ఉండడం విశేషం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలువగా.. ఇప్పుడు నితిన్ కూడా మరో బీజేపీ నేతను కలుసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎక్కువగా సినీ ప్రముఖులు

ఎక్కువగా సినీ ప్రముఖులు

భారతీయ జనతా పార్టీ నేతలు ప్రస్తుతం సినిమా పరిశ్రమలకు కూడా చాలా దగ్గరవుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో చాలామంది సినీ ప్రముఖులు క్రికెటర్లు అలాగే ఇతర రంగాలకు చెందిన వారు కూడా కొనసాగుతున్నారు. వీలైనంతవరకు ఎక్కువగా సినీ ప్రముఖులు బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేతల ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

 బాహుబలి ఎఫెక్ట్

బాహుబలి ఎఫెక్ట్

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇటీవల కాలంలో భారత జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది అనే టాక్ అయితే గట్టిగానే వస్తోంది. గతంలో బాహుబలి సక్సెస్ అనంతరం నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా ప్రభాస్ ను కలిసిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల బాహుబలి రచయితకు ఏకంగా రాజ్యసభ స్థానం కల్పించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్ తో అమిత్ షా

ఎన్టీఆర్ తో అమిత్ షా

ఇక ఇటీవల బీజేపీ ప్రముఖ నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. RRR సినిమా సక్సెస్ అనంతరం అతను చేసిన కొమరం భీమ్ పాత్రకు మెచ్చుకొని ప్రత్యేకంగా అమిత్ షా కలిసినట్లుగా బిజెపి ప్రముఖులు తెలిపారు. అయితే ఈ కలయిక వెనుక కొన్ని రాజకీయ అంశాలు కూడా ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు కరెక్ట్ కాదు అని ఆ తర్వాత బీజేపీ అధినేతలు కొట్టి పారేశారు.

ఇప్పుడు నితిన్ తో..

ఇప్పుడు నితిన్ తో..

ఇక ఇప్పుడు యువ హీరో నితిన్ తో మరో బీజేపీ నేత కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా నితిన్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే హీరో నితిన్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులను కూడా కలుసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం ఇప్పుడు ఆ వెంటనే మళ్ళీ నితిన్ కూడా ప్రముఖ బీజేపీ నేతతో కలవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కలయిక తర్వాత నితిన్ గురించి ఎలాంటి వార్తలు వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X