యమదొంగ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత సి అశ్వనీదత్ నిర్మిస్తున్న కంత్రి సినిమాలో చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ దిల్ రాజు సినిమాలో చేయడానికి కూడా ఒప్పందం చేసుకున్నారు. దిల్ రాజు తన సినిమా ద్వారా మహదేవ్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి వద్ద మహదేవ్ చాలా కాలంగా పనిచేస్తున్నారు. కాగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మహదేవ్ తమ సినిమాకు క్షత్రీయుడు పేరు పెడదామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మే,2008లో ప్రారంభం కానున్నది.