క్రాక్ దర్శకుడికి పెరుగుతున్న డిమాండ్.. లిస్టులో ఇద్దరు స్టార్ హీరోలు
సంక్రాంతి అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. పండగ సీజన్ లో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడం కాయం. అయితే ఇటీవల క్రాక్ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని రేంజ్ కూడా పెరిగింది.
మొదట డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపిచంద్ మలినేని ఆ తరువాత వెంకటేష్ తో బాడీగార్డ్ సినిమాను రీమేక్ చేశాడు. అనంతరం మళ్ళీ మాస్ రాజాతో బలుపు అనే సినిమాను చేశాడు. ఇక రామ్ పండగ చేస్కో, సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ వంటి కమర్షియల్ సినిమాలను చేసిన గోపీచంద్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ఫైనల్ గా క్రాక్ తో ఈ దర్శకుడు కెరీర్ బెస్ట్ హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాకు హిట్ టాక్ రాగానే గోపిచంద్ అగ్ర హీరోల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. అలాగే వెంకటేష్ కూడా గోపిచంద్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ దర్శకుడు కథ చెబితే డేట్స్ ఇవ్వడానికి కొంతమంది హీరోలు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఆ మధ్య హీరో గోపిచంద్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. మరి ఈ రూమర్స్ పై క్రాక్ దర్శకుడు ఎలాంటి క్లారితో ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











