ఆ చీకటి భాగోతంలో హీరోయిన్ సంజన పేరు కూడా..!

By Bojja Kumar

హైదరాబాద్ : జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో ఫిక్సింగ్ అనే చీకటి భాగోతం ఎప్పటి నుండో క్రీడా ప్రేమికులను కలవర పెడుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్‌లో కొందరు ప్లేయర్లు ఈ చీకటి వ్యవహారంలోకి అడుగు పెట్టి బరితెగింపుకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ తారలకు లింకు ఉందనే వార్తలు సైతం వెలువడ్డాయి.

స్పాట్ ఫిక్సింగులో దొరికిపోయిన క్రికెటర్ శ్రీశాంత్....గతంలో పలువురు తారలతో సన్నిహితంగా మెలగడంతో, ఆ తారలకు ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో సంబంధం ఉందేమో? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. శ్రీశాంత్‌తో గతంలో సన్నిహితంగా మెలిగిన హీరోయిన్ లక్ష్మీరాయ్‌పై ఈ మధ్య వార్తలు ప్రముఖంగా వినిపించాయి. దీంతో ఆమె మీడియా ముందుకు వచ్చి తన వివరణ ఇచ్చుకుంది. తనకు ఈ చీకటి వ్యవహారంలో ఎలాంటి లింకు లేదని, చాలా కాలంగా శ్రీశాంత్‌తో తాను టచ్ లోనే లేనని స్పష్టం చేసింది.

తాజా కన్నడ భామ సంజన‌ పేరు ఈ వ్యవహారంలో వినిపిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్‌తో సంబంధాలు ఉన్న హీరోయిన్ల గురించి ఆరా తీస్తున్నారని, శ్రీశాంత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సంజన గురించి కూడా ఆరా తీసారనే వార్తలు వినిపించాయి.

దీంతో షాకైన సంజన....తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. శ్రీశాంత్ తనకు స్నేహితుడనే మాట వాస్తవమే కానీ....స్పాట్ ఫిక్సింగ్ లాంటి చీకటి వ్యవహారాల్లో శ్రీశాంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. 2009లో గోవాలో ఓ పార్టీలో శ్రీశాంత్ తనకు పరిచయం అయ్యాడని, అంతకు మించి మరేమీ లేదని ఓ పత్రికతో మాట్లాడుతూ వెల్లడించింది.

శ్రీశాంత్‌తో డాన్స్ చేసిన సంజన

గోవాలోని ఓపార్టీలో తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినప్పుడు శ్రీశాంత్ పరిచయం అయ్యాడని, అప్పుడు అందరం కలిసి డాన్స్ చేసామని, ప్రత్యేకించి శ్రీశాంత్‌తో ఇతర ఏ విధమైన సంబంధాలు లేవని, ఈ చీకటి వ్యవహారంలోకి తనను లాగడం సబబు కాదని అంటోంది సంజన

మంచోడనుకున్నాను...ఇలా చేస్తాడనుకోలేదు : సంజన

నాకు శ్రీశాంత్ పరిచయం అయినప్పుడు చాలా మంచోడనుకున్నాను. అప్పట్లో క్రికెట్ పట్ల అతనికున్న ప్రేమను చూసి మురిసిపోయాను. కానీ ఇప్పుడు ఇలాంటి స్కాం జరుగడం చూసి విసుగు చెందాను. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు అంటోంది సంజన.

 తనకు సంబంధం లేదని సంజన ఖండన

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తనకు సంబంధం ఉందేమోనని పోలీసులు ఆరా తీయడం, మీడియా వారు ఈ విషయాన్ని హైలెట్ చేసి చూపడంతో ఖంగు తిన్న సంజన......తనకు ఎలాంటి సంబంధం లేదని సంజన వివరణ ఇవ్వడంతో పాటు, తనపై వస్తున్న ఆరోపణలను ఖడించింది.

ఇతర హీరోయిన్లకు సంబంధం లేదంటున్న సంజన

ఈ వ్యవహారంలో కేవలం తనపై వచ్చిన ఆరోపణలను మాత్రమే ఖండించడం కాదు, ఇతర సాండల్ వుడ్ హీరోయిన్లకు ఈ వ్యవహారంలో ఉండరనే అనుకుంటున్నాను. ఇలాంటి చీకటి వ్యవహారాల్లో తలదూర్చడానికి ఎవరూ ఇష్టపడరు అంటోంది సంజన.

సంజన సినిమా వ్యవహారాలు

సంజన సినిమా వ్యవహారాల విషయానికొస్తే....ప్రస్తుతం ఆమె నటించిన ‘మహానంది'(కన్నడ మూవీ) సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఆమె కన్నడ హీరో దర్శన్‌తో ‘అగ్రజ', హీరో ఆదిత్యతో ‘రెబల్', అదే విధంగా రెండు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X