twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ ఎన్నికల్లో ఓటమి తర్వాత శివాజీ రాజా మరింత బాధలో? వీడియోలు హల్‌చల్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా రియాక్షన్ ఏమిటి? నెక్ట్స్ ఏం చేయబోతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు మీడియా వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు.

    మా ఎన్నికలు జరుగడానికి ముందు, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో శివాజీ రాజా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. కొందరు ఆ పాత వీడియోలనే యూట్యూబ్‌లో కొత్తగా సర్క్యులేట్ చేస్తూ.... ఓటమి తర్వాత శివాజీ రాజా మాట్లాడినట్లుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

    అరుణాచలం వెళ్లిపోయారా?

    అరుణాచలం వెళ్లిపోయారా?

    ‘‘ఇన్నాళ్లు షూటింగుల్లో.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పనుల్లో బిజీగా ఉన్నాను. ఇక నేను, నా భార్య అరుణాచలం వెళ్లి సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయిన సమయంలో ఈ ఒక్కసారి ఉండాలని అందరూ బ్రతిమిలాడటంతో అధ్యక్షుడిగా పోటీ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది.'' అని ‘మా' ఎన్నిక ముందు శివాజీ రాజా వ్యాఖ్యానించడంతో... ఆయన అరుణాచలం వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

    బ్యాడ్ నేమ్ రాకుండా ఉండటానికి పనులు చేసిన శివాజీ రాజా

    బ్యాడ్ నేమ్ రాకుండా ఉండటానికి పనులు చేసిన శివాజీ రాజా

    ‘‘ప్రాణం పోయినా, శ్రీకాంత్ నేను తప్పు పని ఎప్పుడూ చేయబోము. ఆ అవసరం కూడా మాకు లేదు. ఆఫీసులో మా అటెండెన్స్ 90 శాతం నుంచి 70 శాతం వరకు ఉంది. మెయిన్ పదవిలో ఉన్నవారి అటెండెన్స్ 20 శాతం కూడా లేదు. అయినా సరే అసోసియేషన్‌కు బ్యాడ్ నేమ్ రాకుండా ఉండటానికి మేము పనులు చేశాం.'' అని శివాజీ రాజా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

    మరింత బాధలో శివాజీ రాజా...

    మరింత బాధలో శివాజీ రాజా...

    "నరేష్ నా సోదరుడు.. నిన్నటిదాకా మా ఇద్దరికీ ఒకటే శాలువా కప్పారు. ఒకటే దండేశారు. నేను ఇప్పటికీ అలానే ఉన్నా. కానీ నన్ను అన్యాయంగా అవమానించారు. నాతో పాటు ప్రెసిడెంటు పదవిని కూడా అవమానించారు. గుండె తరుక్కుపోయింది." వ్యాఖ్యానించారు. అయితే ‘మా' ఎన్నికల్లో ఓటమి తర్వాత శివాజీ రాజా మరింత కృంగుబాటుకు గురైనట్లు తెలుస్తోంది.

    పేదవారికి అందుబాటులో ఉంటారా?

    పేదవారికి అందుబాటులో ఉంటారా?

    ‘‘ఒక వేళ నేను అరుణాచలం వెళ్లిపోయినా(ఓటమి తర్వాత)... సినిమా రంగంలోని పేద ఆర్టిస్టులందరికీ అందుబాటులో ఉంటాను.'' అని శివాజీ రాజా వ్యాఖ్యానించారు. మరి ఎన్నికల ముందు శివాజీ రాజా చెప్పినట్లు తన సేవాగుణాన్ని చాటుకుంటారా? తనకు పదవి ముఖ్యం కాదు, సేవే ముఖ్యం అని నిరూపించుకుంటారా? అనే చర్చ సాగుతోంది.

    English summary
    After MAA election defeat, Actor Shivaji Raja old videos goes viral. Actor Naresh's panel has won the Movie Artistes Association (MAA) elections 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X