మాఫియా డీలింగ్స్, టెర్రరిస్టులుతో లింక్ లుపై రామ్ గోపాల్ వర్మ

By Srikanya

రక్త చరిత్ర అనంతరం రామ్ గోపాల్ వర్మ పోలీస్ డిపార్టమెంట్ నేపధ్యంలో డిపార్టమెంట్ అనే చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గోవింద నిహలానీ అర్ధ సత్య తరహాలో ఉంటుందని, పోలీస్ డిపార్టమెంట్ లోని లోటు పాట్లని కాస్త లోతుగానే తన దైన శైలిలో ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది. ఈ దేశంలోని లా పోర్స్ ఎలా పనిచేస్తోందనే విషయాన్ని ఎక్సపోజ్ చేస్తున్నాని చెప్తున్నారు. ఇక అంతర్గత సమాచారం ప్రకారం కంపెనీ చిత్రం చేస్తున్నప్పుడే ఈ ఐడియా వచ్చిందని, మాఫియా మాదిరిగానే పోలీస్ డిపార్టమెంట్ లోపల ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంటుందని అదే యుఎస్ పి గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈచిత్రంలో పోలీస్ ఎనకౌంటర్ కిల్లింగ్స్ దగ్గరనుంచి, మాఫియా డీలింగ్స్, టెర్రరిస్టులుతో లింక్ లు దాకా ఈ చిత్రంలో చర్చించనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి మొదట కంపెనీ-2 అనుకుని తర్వాత మార్చారు. ఈ విషయాన్ని వివరిస్తూ రామ్ గోపాల్ వర్మ తన బ్లాగ్ లో వివరిస్తూ...ఈ డిపార్టమెంట్ అనే టైటిల్ ని అనుకున్న తర్వాత కంపెనీ-2 అనేది అర్ద రహితంగా తప్పుడు టైటిల్ గా అనిపించింది. పోలీస్ వ్యవస్ధపై తీసే చిత్రానికి డిపార్టమెంట్ సరైన టైటిల్ అనిపించింది. అండరగ్రౌండ్ వరల్డ్ ని ఓ డాన్ నడుపుతూంటాడు. అయితే పోలీస్ వ్యవస్ధ డాన్ మాత్రం డిపార్డ్ మెంట్. చివరగా ఇంతగా వివరించాను కాబట్టి డిపార్టమెంట్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఆ సినిమాకి అని మాత్రం అడగొద్దు అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇక రామ్ గోపాల్ వర్మ చిత్రాలైన రణ్, ఫూంక్ 2 రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X