twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళనాట మరో "మెర్సల్": జీఎస్టీ మీద హిలారియస్ పంచ్ వేసిన "కీ" (వీడియో)

    ఇప్పటికే మెర్సల్ రేపిన వివాదం దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తూంటే ఇప్పుడు ఇంకో తమిళ సినిమా "కీ" కూడా అదే అంశాన్ని లేవనెత్తుతూ, జీఎస్టీ మీద వ్యతిరేకత ఎంత ఉందో చూపించింది. కీ ప్రోమో ఇప్పుడు తమిళనాడు హాట్

    |

    Recommended Video

    తమిళనాట మరో "మెర్సల్" జీఎస్టీ మీద హిలారియస్ పంచ్..

    ఇప్పటికే మెర్సల్ రేపిన వివాదం దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తూంటే ఇప్పుడు ఇంకో తమిళ సినిమా "కీ" కూడా అదే అంశాన్ని లేవనెత్తుతూ, జీఎస్టీ మీద వ్యతిరేకత ఎంత ఉందో చూపించింది. టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో..ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అంతే ఉంటుంది. ప్ర‌మాద‌క‌ర‌మైన బ్లూవేల్ గేమ్ కూడా ఈ సాంకేతిక‌త‌లో భాగంగానే ఉంది. కానీ ఇటువంటి బ్లూవేల్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట‌ను మ‌నం అంద‌రం ఆడుతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే కీ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు కీ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే ఈ సినిమా ప్రోమోలో మాత్రం జీఎస్టీ మీద వేసిన పంచ్ అదిరిపోయేలా ఉంది....

    కీ- Kee

    కీ- Kee

    కీ సినిమాలో ఆర్జే బాలాజీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో జీఎస్టీపై విమర్శలు సంధించారు. ఆర్జే బాలాజీ మరో వ్యక్తితో మాట్లాడుతూ ‘నేనొక కథ చెప్పనా సిద్దార్థ్ సార్? మీరూనేనూ కలిసి రెస్టారెంట్‌కెళ్లాం. బిల్లు చూస్తే భారీగా వచ్చింది.

     జీఎస్టీ. వాళ్లు ఒకరి కడుపు మండేలా చేస్తారు

    జీఎస్టీ. వాళ్లు ఒకరి కడుపు మండేలా చేస్తారు

    ఎంతలా అంటే మనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని తిన్నంత. ఆ ఇద్దరు వ్యక్తులెవరో మీకు తెలుసా? వాళ్లే జీఎస్టీ. వాళ్లు ఒకరి కడుపు మండేలా చేస్తారు' అని డైలాగ్ చెప్తాడు. రెస్టారెంట్‌కు జీఎస్టీ భారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ ప్రోమో సాగింది. మెర్సల్‌ సినిమాకు మద్దతు తెలిపిన తమిళ సినీ ప్రముఖులు ఈ ప్రోమోపై ఏమంటారో తెలియాల్సి ఉంది.

    ఆర్జే బాలాజీ

    ఆర్జే బాలాజీ

    బీజేపీ నేతలు ఇంత వరకూ ఈ ప్రోమోపై స్పందించకపోవడం గమనార్హం. ఈ ప్రోమోను విడుదల చేయడానికి గల కారణాన్ని కూడా ఆర్జే బాలాజీ వివరించాడు. మెర్సల్ వివాదానికి ముందే ఈ ప్రోమోలోని డైలాగ్‌కు డబ్బింగ్ చెప్పినట్లు బాలాజీ చెప్పాడు. కానీ ఈ ప్రోమో ఇప్పుడే రిలీజ్ చేయడానికి కారణముందని కూడా చెప్పాడు.

     మరిన్ని సినిమాలు పుట్టుకొస్తాయి

    మరిన్ని సినిమాలు పుట్టుకొస్తాయి

    ఇలాంటి సమయంలో ప్రజలకు సందేశాన్ని పంపాలన్న ఉద్దేశంతోనే రిలీజ్ చేసినట్లు తెలిపాడు. సమస్యల గురించి ప్రస్తావించిన ఒక సినిమాను ఆపాలనుకుంటే మరిన్ని సినిమాలు పుట్టుకొస్తాయని చెప్పాలన్నదే తమ అభిమతమని చెప్పాడు. ప్రజల అభిప్రాయాలను చెప్పడాన్ని నిలువరించడం ఎవరి వల్లా కాదని ఆర్జే బాలాజీ తెలిపాడు.

    బీజేపీపై పరోక్ష విమర్శలు

    తాము భయపడటం లేదని చెప్పాలనుకుంటున్నామని, మా భావాలను వ్యక్తపరచడాన్ని ఎవరూ ఆపలేరని ఆర్జే బాలాజీ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశాడు. "ఇప్పుడు జోసెఫ్ విజయ్ అయినదుకే మెర్సల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడన్నారు కదా మరి ఇప్పుడు "జీవా" హిందువు కాబట్టే అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా?" అంటూ ఒక నెటిజన్ పేల్చిన పంచ్ మాత్రం సినిమాలో వేసిన పంచ్ కంటే అదిరి పోయింది...

    English summary
    The 28-second promo of Kee, which was released a few days ago, shows the protagonist taking a dig at GST and asking who it is meant to benefit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X