కోకాపేట ఆంటీ(ఝాన్సీ)పై దుమారం..

ప్రభుత్వంతో పాటు జ్యూరీ తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ అవార్డును రద్దు చేయాలని తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్ర సినీ నిర్మాతల అహంకారానికి, డబ్బు మదానికి, తెలంగాణ ప్రజల పట్ల, స్త్రీల పట్ల ఎంత చిన్నచూపు ఆలోచనలు వారిలో దాగిన్నాయో కోకాపేట అంటీ పాత్రలో స్పష్టమవుతున్నదన్నారు. ఈ అవార్డు ఇవ్వడం వెనక ఖచ్చితంగా ఆంధ్రప్రాంతాల వారి భావాజాలం ఉన్నదని అన్నారు.
ఇలాంటి పాత్రలకు అవార్డులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు, సినీ పరిశ్రమకు ఏలాంటి సందేశాన్ని పంపుతున్నదని ఆయన ప్రశ్నించారు. మరోసారి ఇలాంటివి ఎదురైతే తెలంగాణ ప్రజలు చూస్తు ఊరుకోరని, తగిన విధంగా ప్రతిస్పందించక తప్పదని హెచ్చరించారు.అయితే ఇటువంటి అభ్యంతరాలు రిలీజైన కొత్తలో వ్యక్తపరిచి ఉంటే దర్శక,నిర్మాతలు దీనిపై ఆలోచించి ఉండేవారిని సీనియర్స్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











