పాకిస్థాన్ నటికి ఇండియా నుంచి వాటర్ బాటిల్స్.. మండిపోతున్న నెటిజన్లు (వీడియో)

జమ్ము కాశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం టెర్రరిస్ట్ దాడి గురించి అందరికీ తెలిసిందే. 26 మంది టూరిస్టులను పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపిన సంగతి దేశం మొత్తం చూసింది. విచక్షణారహితంగా భారతీయులపై, ముఖ్యంగా హిందువులపై చేసిన దాడిని దేశం మొత్తం ఖండించింది. ముస్లిమేతర ప్రజలను టెర్రరిస్టులు టార్గెట్ చేసి మరి చంపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో దేశ ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాలకు తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

సినిమా పరిశ్రమ నుంచి కూడా జమ్ము కాశ్మీర్ లో గల పహల్గాం లోని బైసరన్ వ్యాలీ లో జరిగిన ఉగ్రదాడికి స్పందించారు. అక్కడ వారికి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 26 మంది కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక టాలీవుడ్ నుంచి టాప్ హీరోలందరూ నివాళి అర్పించగా.. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు 50 లక్షల వరకు సాయం అందించారు.

After Pahalgam Terrerist attact some sending water bottles to Pakisthani Actress Hania Amir

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ లోని పహాల్గాం ఉగ్రదాడి పై చాలా సీరియస్ గా ఉన్నారు. దాడి జరిగిన రోజే అత్యవసర సమావేశం నిర్వహించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. టెర్రరిస్టు మూకాలను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పాకిస్థాన్కు ఇండియన్ నుంచి వెళ్లే నీళ్లు, సింధు లోయ నీటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసింది. ఒక్క చుక్క నీరు కూడా ఆ దేశం వైపు వెళ్లకుండా చూసుకుంటామని, ఇండియా నుంచి చుక్క నీరు కూడా వెళ్లదని స్పష్టం చేశారు. పాకిస్తానీలను కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.

అయితే ఓ వైపు దేశం మొత్తం పాకిస్థాన్ మద్దతుతో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉండగా.. కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్థాన్ కు నీటి ఒప్పందాన్ని ఆపేసి హెచ్చరికలు జారీ చేస్తుండగా... కొందరు మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్ నటి హనీయా అమీర్ అభిమానులు కొందరు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇండియా నుంచి తమ అభిమాన హీరోయిన్ హనీయా అమీర్ కు వాటర్ బాటిల్స్ పంపిస్తున్నామని ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఓవైపు దేశంపై దాడి చేసిన వారిని మట్టు పెట్టాలని ప్రభుత్వం, ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్తానీలను కూడా, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిని కూడా తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చిన.. కొందరు మాత్రం పాకిస్తాన్ కు చెందిన నటికి వాటర్ బాటిల్స్ పంపిస్తుండడం రచ్చగా మారింది. ఇక ఇండియన్ చిత్ర పరిశ్రమలోనూ పాకిస్తాన్ కు చెందిన నటీనటులను తీసుకోవద్దని ప్రేక్షకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో ఫౌజీలో నటించబోతున్న ఇవానా ను కూడా తొలగించాలని పెద్ద ఎత్తున రోడ్స్ నడిచాయి. దానిపై ఆమె కూడా స్పందించింది. నేను భారతీయురాలు నేనని సగర్వంగా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X